Share News

వ.డ్డెర్ల సంక్షేమమే సీఎం చంద్రబాబు ధ్యేయం

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:40 PM

వడ్డెర్ల సంక్షేమ మే ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమ ని నియోజకవర్గ పరిశీలకుడు సీడ్‌ మల్లి కార్జునాయుడు పేర్కొన్నారు.

వ.డ్డెర్ల సంక్షేమమే సీఎం చంద్రబాబు ధ్యేయం
వడ్డెర ఓబన్న చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న నాయకులు

నియోజకవర్గ పరిశీలకుడు మల్లికార్జునాయుడు

కురబలకోట/బి.కొత్తకోట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): వడ్డెర్ల సంక్షేమ మే ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమ ని నియోజకవర్గ పరిశీలకుడు సీడ్‌ మల్లి కార్జునాయుడు పేర్కొన్నారు. శనివారం మండలంలోని అంగళ్ళు, విశ్వం కళాశాల వద్ద స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న 218వ జయంతి వేడుకలను పురస్క రించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డెర్ల కోసం ప్రత్యేక కార్పొరేషనలను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో వడ్డెర సంఘనాయకులు పి.సూరి, వెంకట్రమణ, తులసీ, బాలకృష్ణ, వెంకటరమణారెడ్డి, భాస్కర్‌, దామోధర్‌, మోహన పాల్గొన్నారు. బి.కొత్తకోట జ్యోతిసర్కిల్‌లో వడ్డెర సాధికారసంఘం ఆధ్వ ర్యంలో తాకాటంవారిపల్లెలో బీజేపీ మండలాధ్యక్షుడు డేరింగుల రామదాసు ఓబన్న నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్‌ను కట్‌ చేసి పంచుకున్నారు. కార్యక్రమంలో వడ్డెరసాధికారసమితి నియోజకవర్గ అధ్యక్షుడు నాగమల్లప్ప, మండల అధ్యక్షుడు తమ్మిశెట్టి పద్మనాభం, కాసునాగరాజు, మస్తాన, చంద్రశేఖర్‌, చౌడప్ప, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

ములకలచెరువులో: ములకలచెరువులో శనివారం వడ్డె ఓబన్న 218 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండు సర్కిల్‌లో ఓబన్న చిత్ర పటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. అలాగే భారీ కేక్‌ను కట్‌ చేసి ప్రజలకు పంచి పెట్టారు. కార్యక్రమంలో వడ్డెర సాధికార కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్మిరి నాగమల్లప్ప, నాయకులు కోనంగి శ్రీనివాసులు, డేరంగుల ఆంజ నేయులు తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె అర్బనలో:స్వాతంత్య్ర సమ రంలో వీరోఛితంగా పోరాడిన వడ్డే ఓబన్న జయంతిని మదనపల్లెలో శనివారం ఘ నంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొని పట్ట ణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు బండి ఆనం ద్‌ మాట్లాడుతూ ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్ర మంలో వడ్డెర సంఘం నాయకులు రెవన్న, రెడ్డెప్ప, మల్లయ్య, పద్మనాభ, శ్రీనివాసులు, రమే ష్‌, నాగభూషణ్‌, మెహన, శంకర, రామకృష్ణ, ఆంజనేయులు పాల్గొన్నారు.

పీలేరులో: వడ్డే ఓబన్న జయంతిని పీలేరులో శనివారం తెలుగుదేశం పార్టీ, వడ్డెర సంఘ నాయకురాలు ఓర్సు రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీలేరు మార్కెట్‌ కమిటీ ఎదుట ఆయన భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి కోటపల్లె బాబు రెడ్డి మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచి పెట్టారు. అంతకుమునుపు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలిశెట్టి సురేంద్ర, స్పోర్ట్స్‌ మల్లి, బీసీ అధ్యక్షుడు అప్పస్వామి, బండి సురేం ద్ర, చిన్నప్ప, చంద్రయ్య, రమాదేవి, చంద్రా స్వామి, భాస్కర, సహదేవ, రెడ్పప్ప, చంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను శనివారం తంబళ్లపల్లెలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వడ్డె ఓబన్న చిత్ర పటం ఏర్పాటు చేసి పూల మాలలు వేసి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్దేరు ప్రాజెక్టు చైర్మెన కొటాల శివకుమార్‌, మాజీ సర్పంచ లక్ష్మీపతి, మండల సమాఖ్య అధ్యక్షురాలు రామలక్ష్మీ, సంఘం నాయకులు రమేష్‌బాబు, రేపన మల్లికార్జున, శివకేశవులు, జనార్ధన, బుజ్జన్న, శ్రీనివాసులు, వెంకట్రమణ, నాగరాజు, సుబ్బరాజు, సోమశేఖర్‌, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:40 PM