Share News

పశువుల రక్షణకే గోకులాలు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:23 PM

పశువుల రక్షణ కోసమే ప్రభుత్వం గోకులాలు నిర్మిస్తోందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి తెలిపారు.

పశువుల రక్షణకే గోకులాలు: ఎమ్మెల్యే
చింతకొమ్మదిన్నెలో గోకులాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే క్రిష్ణచైతన్యరెడ్డి తదితరులు

సికెదిన్నె, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పశువుల రక్షణ కోసమే ప్రభుత్వం గోకులాలు నిర్మిస్తోందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రమైన చింతకొమ్మదిన్నెలో ఇండ్లూరు శం కర్‌రెడ్డి రూ.2.30 లక్షలతో నిర్మించిన గోకులాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఎదుగుదలకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 15 వరకు గోకులాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉందన్నారు. మండల ఇన్‌చార్జి టి.వి.క్రిష్ణారెడ్డి, మోహన్‌బాబు, డి.వి.సుబ్బారె డ్డి, పీరూప్రసాద్‌, రాజారావు, నజీర్‌, నా గేంద్ర, మహేశ్వర్‌రెడ్డి, వెటర్నరీ జేడీ శారద, డీపీవో రాజ్యలక్ష్మి, డ్వామా పీడీ, మండల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:24 PM