Share News

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:19 PM

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి బీటెక్‌ రవి అన్నారు.

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు
సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న బీటెక్‌ రవి

పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి బీటెక్‌ రవి

చక్రాయపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి బీటెక్‌ రవి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాలలో టీడీపీ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీటెక్‌ రవి రెండు సీసీ రోడ్లు, 18 గోకులాల షెడ్లను ప్రారంభించా రు. గ్రామీణ ఉపాధి హామీ ప థకం కింద ఒక్కో షెడ్డుకు రూ.2.30లక్షలతో మారెళ్లమడక, అద్దాలమర్రి, కుమార్లకాల్వ, ఎరబొమ్మనపల్లె, కె.రాజుపల్లె, కుప్పం, కల్లూరుపల్లె, మహదేవపల్లె, చిలేకాంపల్లె, చక్రాయపేట, కొండవాండ్లపల్లె గ్రామాలలో ప్రా రంభించారు. అలాగే ఎర్రబొమ్మనపల్లెలో దా దాపు రూ.8లక్షలతోనూ,కొండవాండ్లపల్లెలో రూ.3లక్షలతోనూ నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అలాగే చక్రాయపేటలో అమర్‌నాథరెడ్డి, భరతరెడ్డిల ఆధ్వర్యంలో చేపట్టిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రా రంభించారు. అలాగే అద్దాలమర్రి మాజీ స ర్పంచు రామసుబ్బారెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పట్టెం అశోక్‌, మండల ఉపాధ్యక్షుడు ఎద్దుల చంద్ర, యువనాయకుడు ఎల్‌బీఆర్‌ భాస్కర్‌రెడ్డి, యోగీశ్వర్‌రెడ్డి, ఏపీఓ రవి, ఎంపీడీఓ రాజశేఖర్‌రెడ్డి, పీఆర్‌ డీఈ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:19 PM