Share News

దివ్యాంగులకు నిత్యావసరాల వితరణ అభినందనీయం

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:26 PM

బ్రెయిలీ డే సందర్భంగా పులివెందుల పోలీసుశాఖ తరపున రూరల్‌ సీఐ ఎన్వీ రమణ దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ అన్నారు.

దివ్యాంగులకు నిత్యావసరాల వితరణ అభినందనీయం
దివ్యాంగులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్న పోలీసులు

పులివెందుల టౌన, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : బ్రెయిలీ డే సందర్భంగా పులివెందుల పోలీసుశాఖ తరపున రూరల్‌ సీఐ ఎన్వీ రమణ దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ అన్నారు. ఆదివారం బ్రెయిలీ జయంతుత్యవాల్లో భాగంగా పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న దివ్యాంగుల కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన అంధుల దినోత్సవానికి డీఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1809లో ఫ్రాన్స దేశంలోని ప్యారిస్‌ సమీపంలో క్రూవే అనే ఒక చిన్న కు గ్రామంలో జన్మించిన లూయిస్‌ బ్రెయి లీ తన చిన్న వయసులో రెండు కళ్లను కోల్పోయినప్పటికీ తన అసాధారణ ప్రతిభాపాటవాలతో, నిరంతర కృషితో ఆరుచుక్కల స్పర్శతో కూడిన ప్రత్యేక లిపిని కనుగొని అంధుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అనంతరం సీఐ ఆర్ధిక సాయంతో రూ.30 వేలు విలువ చేసే నిత్యావసర వస్తువులను 30 దివ్యాంగుల కుటుంబాలకు డీఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చే యడం జరిగింది. అనంతరం దివ్యాంగుల మ ధ్య కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టా రు. దివ్యాంగుల నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో దివ్యాం గులు డీఎస్పీ, సీఐలను సత్కరించారు. అనంతరం అంధులను అభ్యుదయ వివాహం చేసుకున్న చిన్న, ప్రమీళను సన్మానించారు. ఈ సందర్భంగా వికలాంగుల శిక్షణ కార్యక్రమాలకు తన వంతుగా రూ.పది వేల వి రాళం అందిస్తున్న డీఎస్పీ మురళీనాయక్‌ ప్రకటించారు. దివ్యాంగుల నెట్‌వర్క్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇరికిరెడ్డి రఘునాథరెడ్డి, కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సునీల్‌, కానిస్టేబుల్‌ పురుషోత్తంరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 11:26 PM