Share News

నవోదయలో తాగునీటి సమస్య పరిష్కారం

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:40 PM

మదనపల్లె మండ లం వలసపల్లె వద్ద ఉన్న జవ హర్‌ నవోదయ విద్యాలయలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే షాజహానబాషా పరిష్కరిం చారు.

నవోదయలో తాగునీటి సమస్య పరిష్కారం
నవోదయ విద్యాలయలో తాగునీటి బోరు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె మండ లం వలసపల్లె వద్ద ఉన్న జవ హర్‌ నవోదయ విద్యాలయలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే షాజహానబాషా పరిష్కరిం చారు. గతంలో నవోదయలో పర్యటిం చినప్పుడు నీటి సమస్య ఉందని ప్రిన్సి పాల్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే మదనపల్లె మండల పరిషత నిధులు రూ.5లక్షలు వెచ్చించి బోరు తవ్వించి కొత్త మోటారు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఈ బోరు మోటారును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాజ్‌మస్రూర్‌, నవోదయ ఇనచార్జి ప్రిన్సిపాల్‌ వేలా యుధన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 11:40 PM