Share News

కార్యదర్శుల సంఘం ఏర్పాటు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:38 PM

మండలంలోని గ్రేడ్‌-1 పంచాయతీ నుంచి గ్రేడ్‌-6 వరకు ఉన్న పంచాయతీ కార్యదర్శుల సంఘాన్ని ఎంపీడీవో కిరణ్‌మోహనరావు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేశారు.

కార్యదర్శుల సంఘం ఏర్పాటు
పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడికి నియామక పత్రం అందిస్తున్న ఎంపీడీఓ

చెన్నూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గ్రేడ్‌-1 పంచాయతీ నుంచి గ్రేడ్‌-6 వరకు ఉన్న పంచాయతీ కార్యదర్శుల సంఘాన్ని ఎంపీడీవో కిరణ్‌మోహనరావు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేశారు. పది గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఎంపీడీవో కార్యాలయంలో హాజరై అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎంపిక చేశారు. మండల కార్యదర్శుల సంఘం అధ్యక్షుడిగా ఉప్పరపల్లె కార్యదర్శి షేక్‌ అన్వర్‌బాషా, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదరెడ్డి, కోశాధికారిగా షేక్‌ గౌస్‌బాషా, మహిళా కార్యదర్శిగా ఎల్‌.సుప్రియారెడ్డి కార్యవర్గంగా ఏర్పాటయ్యా రు. ఎంపికైన వారికి ఎంపీడీవో నియామక పత్రాలను అందించారు.

Updated Date - Jan 07 , 2025 | 11:38 PM