కమనీయం.. గోదాదేవి కల్యాణం
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:14 PM
స్థానిక బర్మావీధిలోని షిర్డిసా యిబాబా ఆలయంలో సోమవారం కన్నుల పండువగా గోదాదేవి కల్యా ణాన్ని ఆలయక మిటీ ఉపాధ్యక్షుడు నాదేళ్ల బాబునాయుడు ఆధ్వర్యంలో వైభవంగా కమనీయంగా నిర్వహించారు.
మదనపల్లె అర్బన, జనవరి 13(ఆంధ్రజ్యోతి): స్థానిక బర్మావీధిలోని షిర్డిసా యిబాబా ఆలయంలో సోమవారం కన్నుల పండువగా గోదాదేవి కల్యా ణాన్ని ఆలయక మిటీ ఉపాధ్యక్షుడు నాదేళ్ల బాబునాయుడు ఆధ్వర్యంలో వైభవంగా కమనీయంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివార్లను ప్రత్యే కంగా ఉత్సవ విగ్రహాలను పెళ్లిపందిరిలో విశేషంగా అలంకరణ చేసి సంప్ర దాయబద్ధంగా కల్యాణం నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. వారు గోదాదేవి కల్యాణం తిలకించడం వరంగా భావించారు. అనంతరం భక్తులకు మధ్యాహ్నం ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్ర మంలో నాదేళ్ల బాబునాయుడు, మార్పురి నాగార్జున బాబు(గాంథీ), కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.