Share News

ప్లాస్టిక్‌ వాడకాన్ని మానేద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:24 PM

పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్‌ వాడకాన్ని మానే ద్దాం అని ఆహార విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక కళాశాల ఎనఎ్‌సఎ్‌స విద్యార్థులు నినదించారు.

ప్లాస్టిక్‌ వాడకాన్ని మానేద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
ర్యాలీ నిర్వహిస్తున్న ఎనఎ్‌సఎ్‌స విద్యార్థులు

పులివెందుల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్‌ వాడకాన్ని మానే ద్దాం అని ఆహార విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక కళాశాల ఎనఎ్‌సఎ్‌స విద్యార్థులు నినదించారు. ఆది వారం జాతీయ సేవా పథకంలో భాగంగా పులివెందుల పరిధిలోని బ్రాహ్మణపల్లెలో ఎనఎ్‌సఎ్‌స ప్ర త్యేక శిబిరం, అలాగే పశువైద్యశిబిరం నిర్వహించారు. పశువులకు నట్టల నివారణ మందు, గర్భనిర్ధారణ, సాధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశా రు. పశువ్యాధులపై ప్రజలు చెప్పిన సమస్యలకు పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎనఎ్‌సఎ్‌స ప్రత్యే క శిబిరంలో భాగంగా ఈనెల 10వ తేదీ వరకు బ్రాహ్మణపల్లెలో ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆరో గ్యం, పరిశుభ్రత, ఆహార నియమాలు, కల్తీలు తదితర వాటిపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ఎనఎ్‌సఎ్‌స వలంటీర్లు ముందుంటారని కొనియాడారు. పశువైద్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.నరేంద్రరెడ్డి, లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ ఎం.నందిని, జూనియర్‌ డాక్టర్‌ రూపే్‌షనాయక్‌, టెక్నీషియన ప్రసాదరావు, ట్రైనీ లక్ష్మీపతి, కళాశాల జాతీయ సేవా పథకం కార్యక్రమ అధికారి డాక్టర్‌ జయమ్మ, అధ్యాపకులు డాక్టర్‌ సాయిశ్రీనివాస్‌, పీడీ డాక్టర్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 11:24 PM