Share News

అంబేడ్కర్‌ భవనానికి కేటాయించిన స్థలం మాదే

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:43 PM

మదనపల్లె పట్టణం రెడ్డెప్పనా యుడు కాలనీలో అంబేడ్కర్‌ భవనాని కి కేటాయించిన స్థలం తమదే అని, దానిపై హైకోర్టులో కేసు నడుస్తున్నా కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తు న్నారని బాధితుడు కె.శ్రీరాములునా యుడు సబ్‌కలెక్టర్‌కు విన్నవించారు.

అంబేడ్కర్‌ భవనానికి కేటాయించిన స్థలం మాదే
ప్రజల అర్జీలు పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌

సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌కు బాధితుడి వినతి

మదనపల్లె టౌన, జనవరి 6(ఆంధ్ర జ్యోతి): మదనపల్లె పట్టణం రెడ్డెప్పనా యుడు కాలనీలో అంబేడ్కర్‌ భవనాని కి కేటాయించిన స్థలం తమదే అని, దానిపై హైకోర్టులో కేసు నడుస్తున్నా కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తు న్నారని బాధితుడు కె.శ్రీరాములునా యుడు సబ్‌కలెక్టర్‌కు విన్నవించారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుడు శ్రీరాములు మాట్లాడుతూ సర్వేనెంబరు 335లో 12 సెంట్ల స్థలాన్ని తాను మాజీ సైనికుడి వద్ద కొనుగోలు చేసి రిజిసే్ట్రషన చేయించుకున్నాని, కొందరు ఆ స్థలంలో పునాదులు వేయడంతో కోర్టుకు వెళ్లి, ఉత్తర్వులు తెచ్చుకుని పునాదులు తొలగించామన్నారు. దీనిపై ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. మదనపల్లె మండలం తురకపల్లె లోకల్‌ అఽథారిటిలో ఉందని, ఇక్కడ మురుగునీటి కాలువలు, రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నామని ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన ప్రజలు విన్నవించారు. తంబళ్లపల్లె మండలం కేంద్రంలోని తమ ఆస్తులను కొందరు కబ్జా చేశారని, దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని కరీముల్లా అనే బాధితుడు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఇంటికి వెళ్లే రోడ్డును కొందరు కంచె వేసి అడ్డగించారని, దీనిపై సర్వే చేయించిన తమకు దారి సౌకర్యం కల్పించా లని బి.కొత్తకోటకు చెందిన అమీర్‌ సబ్‌కలెక్టర్‌కు విన్నవించారు. వీటితో పాటు భూ ములకు సంబంధించి పాసుపుస్తకాలు, సర్వే తదితర సమస్యలపై ప్రజలు సబ్‌కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు.

Updated Date - Jan 06 , 2025 | 11:43 PM