ఆగని ఇసుక, మట్టి తవ్వకాలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:36 PM
ఇసుక, మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా వాటికి అడ్డుకట్ట వేయలే కపోతుండటం గమనార్హం.
వాల్మీకిపురం, జనవరి 12(ఆంఽధ్రజ్యోతి): ఇసుక, మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా వాటికి అడ్డుకట్ట వేయలే కపోతుండటం గమనార్హం. స్థానిక అవసరాలకు మినహా బయటి ప్రాంతా లకు ఇసుక అక్రమ రవాణా చేయకూడదన్న నిబంధనలను ఏమాత్రం లెక్క చేయకపోవడం శోచనీయం. వాల్మీకిపురం మండల వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా, రహస్య డంపింగ్‌లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మండలం లోని బాహుదా కాలువ ప్రాంతంలో ఇసుకాసురుల అక్రమాలకు అధికారులు ఏమాత్రం కళ్లెం వేయలేకపోతున్నారన్న విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు అధికారుల నిఘా ఉన్నప్పటికీ ఇసుక మాఫియా అక్రమాలను ఏమా త్రం నిలువరించలేకపోతున్నారన్న విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. మం డలంలోని కూరపర్తి గ్రామ కుంట పొరంబోకు స్థలాలు, బాహుదా కాలువ ప్రాంతాలను ఏకంగా జేసీబీ యంత్రాలతో ఇసుకను డంపింగ్ చేస్తూ అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నించిన గ్రామస్థులను బెదిరింపు లకు గురి చేయడంతో మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిమ్మనపల్లెలో యఽథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
నిమ్మనపల్లి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండలంలో యథేచ్ఛగా మట్టిని తర లించి కొందరు పబ్బంగడుపుకుంటున్నారు. ఆదివారం నిమ్మనపల్లి పంచా యతి బాహుదా కాలువ పక్కన ఉన్న అగ్రహారం పంచాయతి నుంచి మట్టిని తవ్వి టిప్పర్ల సాయంతో మదనపల్లికి చెందిన వైసీపీ కౌన్సిలర్ శివారెడ్డి తర లిస్తున్నాడు. మట్టి తరలించాలంటే సంబంధిత తహసీల్దార్ వద్ద అనుమతు లు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాగా టిప్పర్ల సాయంతో దాదాపు 100లోడ్లకు పైగా మట్టిని తరలించి భూమి చదును చేసుకొని ప్లాట్లు వేసేం దుకు సిద్ధం చేస్తున్నాడు. దీనిపై కౌన్సిలర్ మాట్లాడుతూ తమకు అన్నీ అనుమతులు ఉన్నాయని సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు పోలీ సులతో కూడా తమకు ఇబ్బంది లేదని తెలిపారు. దీనిపై తహసీల్దార్ దనంజేయులును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా మట్టి తరలింపునకు ఎలాంటి అనుమలు లేవని తెలిపారు. ఎవరైనా సరే అక్రమంగా మట్టిని తరలిస్లే అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.