యానాదుల కాలనీని ‘చెంచులక్ష్మి’గా మార్చాలి
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:01 AM
పీలే రు మండలం ఆరెంవారిపల్లె గ్రామంలోని యానాదుల కాలనీని చెంచులక్ష్మి గ్రామం గా మార్చాలని పలువురు గిరిజ నాయ కులు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డిని కోరారు.
కలికిరి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పీలే రు మండలం ఆరెంవారిపల్లె గ్రామంలోని యానాదుల కాలనీని చెంచులక్ష్మి గ్రామం గా మార్చాలని పలువురు గిరిజ నాయ కులు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డిని కోరారు. శుక్రవారం నగరిపల్లెలో ఎమ్మెల్యేని కలిసిన నాయకులు మాట్లాడు తూ గిరిజన యానాదుల కోసం ప్రత్యేకం గా కార్పొరేషన ఏర్పాటు చేయించేందుకు కృషి చేయాలని కోరారు. అదే విధంగా నియోజకవర్గంలోని యానాదుల ఆవాసాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల న్నారు. వివిధ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్న యానాదుల కోసం ప్రత్యేక శిబి రాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను గుర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు జానం గంగిరెడ్డి, ఉపాధ్యక్షుడు చుక్కలపాటి ఆదినారాయణ, జిల్లా నాయకులు కిల్లా విజయకుమార్, గానుగపెంట సిద్దు తదితరులు పాల్గొన్నారు.