అంబేడ్కర్‌ను మళ్లీ కించపరిచారు: పురందేశ్వరి
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:23 AM
బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కర్ణాటకలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక ఎయిర్ కార్గో సౌకర్యాల ఏర్పాటుపై కూడా ఆమె లోక్‌సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

న్యూఢిల్లీ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ‘రాజ్యాంగాన్ని మార్చేసైనా సరే కర్ణాటకలో ముస్లిం మైనారిటీలకు 4ు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి, గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ మరోసారి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కించపరిచింది’ అని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఎక్స్ వేదికగా విమర్శించారు. హార్టికల్చర్ ఉత్పత్తులు, ఆహారం, ఔషధాలు, వస్త్రాల ప్రధాన ఎగుమతిదారు అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రత-నియంత్రిత నిల్వతో కూడిన ఆధునిక ఎయిర్ కార్గో వేర్‌హౌసింగ్ ఒక్క విమానాశ్రయంలో కూడా లేదని పురందేశ్వరి సోమవారం లోక్‌సభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి ఎయిర్ కార్గో సౌకర్యాలను నెలకొల్పేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ పురందేశ్వరి కోరారు.