Share News

Finance Dept : ఆర్థిక శాఖ మంజూరు చేసిన పోస్టులకే ఎంటీఎస్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:52 AM

మినిమమ్‌ ఆఫ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ఏ ఉద్యోగులకు వర్తిస్తుందన్న అంశంపై స్పష్టతనిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Finance Dept : ఆర్థిక శాఖ మంజూరు చేసిన పోస్టులకే ఎంటీఎస్‌

  • ఔట్‌సోర్సింగ్‌కు వర్తించదు.. ఉత్తరులు జారీ

అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మినిమమ్‌ ఆఫ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ఏ ఉద్యోగులకు వర్తిస్తుందన్న అంశంపై స్పష్టతనిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, సొసైటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేసిన కాంట్రాక్టు ఉద్యోగులు, ఆర్థిక శాఖ ఆదేశాలతో నియామకం పొందిన కాంట్రాక్టు ఉద్యోగులు, కారుణ్య నియమకాల్లాంటి ప్రత్యేక విభాగాల ద్వారా భర్తీ అయిన ఉద్యోగులకు మాత్రమే ఎంటీఎస్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎంటీఎస్‌ ప్రకారం అందే ఆర్థిక ప్రయోజనాలను ఒకేమొత్తంలో నెలకోసారి ఇస్తారు. విడిగా ఎలాంటి అలవెన్సులు ఉండవు. ఎంటీఎస్‌ కింద వేతనాలు పొందే ఉద్యోగులకు ఆ మొత్తంపైవార్షిక ఇంక్రిమెంట్లు ఉండవు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎంటీఎస్‌ ప్రయోజనాలు వర్తించవని పేర్కొన్నారు. ఇకపై ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా కొత్తగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగుల నియామకం చేపట్టకూడదని పీయూష్‌ కుమార్‌ జీవోలో స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో, సీసీఏ నిబంధనల ప్రకారం భారీ జరిమానా విధిస్తామని వెల్లడించారు.

Updated Date - Jan 07 , 2025 | 06:53 AM