Share News

AP Assembly: ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం..

ABN , Publish Date - Mar 20 , 2025 | 08:50 AM

ఏపీ ఉభయ సభలు గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం ఎస్సీ వర్గికరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉభయ సభల ముందు ప్రవేశపెడతారు. దీనిపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. కాగా ఈరోజు ఎస్సీ వర్గీకరణపై శాసనసభ తీర్మానం చేయనుంది.

AP Assembly: ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం..
AP Assembly Budget Session

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈరోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాలు ఉభయ సభల్లో కొనసాగుతాయి. శాసన సభలో ఆయకట్టు స్థిరీకరణ..తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునికీకరణ...పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ, ఎస్‌ఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్లు.. కేంద్ర ప్రాయోజిత పథకాలు తదితర వాటిపై ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. అనంతరం ఎస్సీ వర్గికరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉభయ సభల ముందు ప్రవేశపెడతారు. దీనిపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. కాగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ (SC classification)పై శాసనసభ తీర్మానం చేయనుంది.


శాసన మండలిలో ...

శాసన మండలిలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్‌లు... మిని గోకూలాలు... ఆస్పత్రుల ఆధునీకరణ...నూతన పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. కాగా విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా సిఎం చంద్రబాబు,మండలి చైర్మన్ మోషేన్ రాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తదితరులు హాజరవుతారు. క్రీడలు..సాంస్కృతిక పోటీల్లో విజేతలకు సీఎం చంద్రబాబు,స్పీకర్ అయ్యన్న చేతుల మీదుగా బహుమతులు ఆందజేస్తారు.

Also Read..:

కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన


కాగా తానా సభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆ సంస్థ ప్రతినిధులు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడిని ఆహ్వానించారు. అమెరికా మిషిగాన్‌ రాష్ట్రం, నోవీ నగరంలో 24వ తానా సభలు జూలై 3 నుంచి 5 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో స్పీకర్‌ చాంబర్‌లో ఆయనను తానా కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ నాదెళ్ల గంగాధర్‌, మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్‌ నాదెళ్ల తదితరులు కలిశారు. సభలకు రావలసిందిగా ఆహ్వానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం

రేషన్ కార్డులు కాదు.. పాపులర్ కార్డులు..

విజయ్‌కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు

For More AP News and Telugu News

Updated Date - Mar 20 , 2025 | 08:50 AM

News Hub