Share News

ఏటీఎంలో బ్లాక్‌ గ్యాంగ్‌

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:21 AM

ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడం రాని వారిని మాయ చేసి డబ్బులు కాజేస్తారు కొందరు. ఏటీఎంలను పగలగొట్టి చోరీలు చేసే ముఠాలూ ఉన్నాయి. ఇప్పుడు ఏటీఎంలలో డబ్బులు కాజేయడానికి కొత్త ముఠా పుట్టుకొచ్చింది. పెనమలూరులో కొత్త విధానంలో డబ్బులు కాజేయడానికి ప్ర యత్నించిన ముఠాను పెనమలూరు క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

ఏటీఎంలో బ్లాక్‌ గ్యాంగ్‌

డబ్బులు వచ్చే మార్గాన్ని బ్లాక్‌ టేపుతో మూసేస్తున్న ముఠా

ఖాతాదారులు వెళ్లిపోయాక డబ్బులు చోరీ

ఢిల్లీ, ఆగ్రా నుంచి వచ్చిన నేరగాళ్లు

పెనమలూరు పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

విజయవాడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడం రాని వారిని మాయ చేసి డబ్బులు కాజేస్తారు కొందరు. ఏటీఎంలను పగలగొట్టి చోరీలు చేసే ముఠాలూ ఉన్నాయి. ఇప్పుడు ఏటీఎంలలో డబ్బులు కాజేయడానికి కొత్త ముఠా పుట్టుకొచ్చింది. పెనమలూరులో కొత్త విధానంలో డబ్బులు కాజేయడానికి ప్ర యత్నించిన ముఠాను పెనమలూరు క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ ఏటీఎంలను టార్గెట్‌ చేసుకుంటారు. కొన్ని బ్యాం కులు ఏటీఎం కేంద్రాల్లో పాత యంత్రాలను కొనసాగిస్తున్నాయి. మరి కొన్ని బ్యాంకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏటీఎంలను ఉపయోగిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం పెట్రో అనే కంపెనీకి చెందిన ఏటీఎం యంత్రాలను ఉపయోగిస్తున్నాయి. వా టికి ఖాతాదారులు ఏటీఎం వద్ద నిలబడినప్పుడు కాళ్ల భాగం వద్ద చి న్న తలుపు ఉంటుంది. వెనుక నగదు క్యాసెట్‌ ఉంటుంది. ఏటీఎంలో కార్డు పెట్టి పిన్‌ ఎంటర్‌ చేసిన తర్వాత ఈ క్యాసెట్‌ ద్వారా డబ్బులు పైకి వస్తాయి. ఈ ఉత్తరాది ముఠా ఏటీఎం కింది భాగాన ఉన్న చిన్న తలుపును నకిలీ తాళంతో తెరుస్తుంది. నగదు క్యాసెట్‌కు నోట్లు పైకి రావడానికి ఉన్న సన్నని మార్గాన్ని నలుపురంగు టేపుతో మూసేస్తుంది. ఖాతాదారులు పిన్‌ ఎంటర్‌ చేసినప్పుడు డబ్బులు తీసుకున్నట్టు రశీదు బయటకు వస్తుంది. ఏటీఎం నుంచి డబ్బులు బయటకు రావు. ఏదో సాంకేతికలోపం ఉందని భావించి ఖాతాదారులు వెళ్లిపోయాక పక్కనే నక్కిన ముఠా ఏటీఎంలోకి వెళ్లి నలుపు టేపును తొలగించి డబ్బులు కాజేస్తుంది. తర్వాత ఆ డబ్బులు తమ సొంత ఖాతాల్లో డిపాజిట్‌ మిషన్‌ నుంచి జమ చేసుకుంటారు. పెనమలూరు మండలం కానూరులోని అశోక్‌నగర్‌లో ఉన్న ఏటీఎం నుంచి ఈవిధంగా చోరీ చేయడానికి ప్రయత్నిస్తుండగా ముగ్గురు యువకులను పెనమలూరు క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా నగదును కాజేయడంలో ఉన్న ఈ కొత్త విధానాన్ని వెల్లడించారు. రా ష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈ తరహాలో ఏటీఎం నుంచి బయటకు వచ్చే ఖాతాదారుల నగదును నొక్కేశారు. ఈ వివరాలను పెనమలూరు పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Jan 12 , 2025 | 01:21 AM