Share News

కారు - బైక్‌ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:35 AM

ఎదురెదురుగా వస్తున్న కారు- బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రంగా, మరొకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం నుజ్జయ్యింది.

కారు - బైక్‌ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మరొకరికి స్వల్పగాయాలు..ఆస్పత్రికి తరలింపు

మోపిదేవి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): ఎదురెదురుగా వస్తున్న కారు- బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రంగా, మరొకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం నుజ్జయ్యింది. ఈ ఘటన పెదప్రోలు పంచాయతీ శివారు కఫ్తానుపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిం ది. చల్లపల్లి వైపు నుంచి అవనిగడ్డకు వెళ్తున్న మహీంద్రా కారు.. మోపిదేవి నుంచి చల్లపల్లి వైపు వెళ్తున్న బైక్‌ ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొట్టుకున్నాయి. ద్విచక్రవాహనం ముందు చక్రం ఊడిపోయింది. ఇంజన్‌తో సహా దూ రంగా పడింది. బైక్‌పై ఉన్న పెదప్రోలుకు చెందిన కొక్కిలిగడ్డ రాజేష్‌, నాగేశ్వరరరావు గాలిలో ఎగిరి వెనుక వస్తున్న శివరామపురానికి చెందిన వేములపల్లి శివప్రసాద్‌ బైక్‌పై పడ్డారు. దీంతో కొక్కిలిగడ్డ రాజేష్‌, వేములపల్లి శివప్రసాద్‌కు కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. నాగేశ్వరరావు స్వల్పంగా గాయపడ్డాడు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో 108 అంబులెన్స్‌లో అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. కారు ముందు భాగం దెబ్బతిన్నది. ద్విచక్ర వాహనం ముందు భాగం పూర్తిగా విరిగి దూరంగా పడటంతో భారీ శబ్దం వ చ్చి, సమీప గృహాల ప్రజలు భయపడ్డారు. ఎస్సై సత్యనారాయణ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 16 , 2025 | 12:35 AM