తరగతి గదులు మినీ ల్యాబ్‌లుగా మారాలి
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:38 AM
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని తరగతి గదులు మినీ ల్యాబుల్లా, విద్యార్ధులు వివిధ పరిశోధనలు చేసే స్థాయికి ఎదగాలని సర్వశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఆకాంక్షించారు.
సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు
పెనమలూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని తరగతి గదులు మినీ ల్యాబుల్లా, విద్యార్ధులు వివిధ పరిశోధనలు చేసే స్థాయికి ఎదగాలని సర్వశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఆకాంక్షించారు. బుధవారం పోరంకి మురళీ రిసార్ట్సులో నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన రెండో రోజు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను తిలకించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. వ్యక్తిగత విభాగం నుంచి 15, గ్రూపు నుంచి 10, ఉపాధ్యాయ ఎగ్జిబిట్స్ నుంచి పది అద్భుత ప్రదర్శనలను ఎంపిక చేసి ఈనెల 20 నుంచి 25 వరకు పాండిచ్చేరిలో నిర్వహించే దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు పంపుతామని ఆయన తెలిపారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి, కంకిపాడు, పెనమలూరు ఎంఈవోలు పాల్గొన్నారు.