CM Chandrababu: టెక్నాలజీ వినియోగంతో రియల్ టైమ్‌లో సేవలు
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:09 PM
CM Chandrababu: 2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ కోసం ఎదురు చూసిన రోజుల నుంచి డేటా ఆధారిత పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. వేగంగా భూరికార్డుల డిజిటలైజేషన్ చేయాలని వెల్లడించారు.
అమరావతి, ఏప్రిల్ 24: పాలనలో ఏఐని వినియోగించినా మానవీయకోణం ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు సచివాలయంలో నిర్వహించిన ఏఐ వర్క్‌షాప్‌లో సీఎం మాట్లాడుతూ.. టెక్నాలజీ వినియోగంతో రియల్ టైమ్‌లో సేవలను డెలివరీ చేయొచ్చన్నారు. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఉంటుందని, త్వరలో భారీ డేటా లేక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ప్రజలకు సేవల విషయంలో మానవీయకోణం చూపాలని చెప్పుకొచ్చారు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల్ టైమ్‌లో సేవలు అందించవచ్చని చెప్పారు. ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టాలన్నారు. టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలన్నారు. రాష్ట్రంలో భారీ డేటా లేక్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టామని తెలిపారు.
‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. 2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ కోసం ఎదురుచూసిన రోజుల నుంచి డేటా ఆధారిత పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దామన్నారు. వేగంగా భూరికార్డుల డిజిటలైజేషన్ చేయాలని వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్లో అధికంగా 75 శాతం భూసంబంధితమైనవే ఉన్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Tirumala High Alert: పహల్గామ్ దాడితో తిరుమలలో అలర్ట్
కాగా.. ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్‌షాప్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు వర్క్‌షాప్‌కు హాజరై, ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చించనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలించనున్నారు. ఏయే విభాగాల్లో ఎటువంటి సాంకేతికను వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృత పరచవచ్చు అనే దానిపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఏఐ, ఎంఎల్, డీఎల్, చాట్ జీపీటీ, జెమిని, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలెట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయం, విద్య, వైద్య, పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పలువురు నిపుణులు వివరించనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న వర్క్‌షాప్‌లో మొదటిరోజు కార్యదర్శులు, రెండోరోజు విభాగాధిపతులు హాజరుకానున్నారు. ఈ వర్క్‌షాప్‌కు సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. అలాగే వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈవో ప్రకాష్ కుమార్, డబ్ల్యుజీడీటీ డీన్ కమల్ దాస్‌తో సహా పలువురు నిపుణులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
PSR Prisoner Number: జైలులో పీఎస్‌ఆర్ ప్రత్యేక అభ్యర్థన.. ఏంటంటే
Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
Read Latest AP News And Telugu News