వృత్తినైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:24 AM
చేతివృత్తుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచి, గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ స్థ(యూబీఆర్‌ఎ్‌సఈటీఐ)కృషి చేస్తోందని సంస్థ డైరెక్టర్ పి.మల్లికార్జునరెడ్డి తెలిపారు.
ఉంగుటూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): చేతివృత్తుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచి, గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ స్థ(యూబీఆర్‌ఎ్‌సఈటీఐ)కృషి చేస్తోందని సంస్థ డైరెక్టర్ పి.మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆత్కూరు స్వర్ణభారత్‌ట్ర్‌స్ట ప్రాంగణంలోని యూబీఆర్‌ఎ్‌సఈటీఐలో ఈనెల 20, 27 తేదీల్లో ప్రారంభించనున్న వృత్తినైపుణ్య కోర్సుల వివరాలను ఆయన వెల్లడించారు. ఈనెల 20 నుంచి యువతులకు టైలరింగ్(30 రోజులు), పుట్టగొడుగుల పెంపకం(10 రోజులు), 27 నుంచి జ్యూట్‌బ్యాగ్‌ల తయారీ(13 రోజులు), బ్యూటీపార్లర్ మేనేజ్‌మెంట్ (30 రోజులు), యువకులకు సెల్‌ఫోన్ రిపేరింగ్(30 రోజులు) కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు, తెలుగులో చదవటం, రాయడం వచ్చి ఉండాలన్నారు. ఆధార్, రేషన్‌కార్డు కలిగిన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని గ్రామీణులు అర్హులన్నారు. శిక్షణ కాలంలో శిక్షణ, వసతి, భోజనం ఉచితమన్నారు. శిక్షణానంతరం సర్టిఫికెట్లు, కోర్సులకు మెటీరియల్, టూల్‌కిట్లు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. సొంతంగా వ్యాపారం చేసుకునే అభ్యర్థులకు బ్యాంకులనుంచి రుణసౌకర్యం పొందేందుకు సహకారాలు అందిస్తామన్నారు. నాలుగు పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, విద్యార్హతల ధ్రువీకరణపత్రాల జిరాక్స్ కాపీలతో జనవరి 20వతేదీ లోపు నేరుగా శిక్షణ కేంద్రానికి వచ్చి పేర్లను నమోదుచేసుకోవాల ని, 63042 54730, 94900 11081, 63021 71225లో సంప్రదించాలని సూచించారు.