Share News

ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:44 AM

ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి

ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు

ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు

భారతీనగర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ కె.భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే స్ర్తీ విద్యాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.శైలజా మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం సావిత్రిబాయి ఫూలే పోరాటం చేశారని తెలిపారు. డబ్ల్యూఈసీ కోర్డినేటర్‌ కొప్పూరి అరుణ , డాక్టర్‌ ఎన్‌. లక్ష్మీజానకి, ఎ. ఉమా తరంగిణి, టి. వకులప్రియా, ఎ. శాంతకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

25 మంది ఎంపిక

ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్‌నాలెడ్జ్‌ సెంటర్‌, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో దివీస్‌ లాబొరేటరీస్‌ ఆధ్వర్యంలో శనివారం జాబ్‌మేళా నిర్వహించారు. ఈ మేళాలో 25 మంది ఎంపిక అయ్యారని వారికి నియామకపత్రాలను ఇచ్చారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేకేసీ కో ఆర్డినేటర్‌ జి.విజయ్‌ దీప్‌, ప్లేస్‌మెంట్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ.ఆశీర్వాదం, డాక్టర్‌ సీహెచ్‌ అప్పారావు, కెమిస్ర్టీ డిపార్టుమెంట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ మాల్యాద్రి, డాక్టర్‌ షేక్‌ బీబీ, జేకేసీ ఎఫ్‌టీఎం సురేష్‌, దివీస్‌ లాబొరేటరీస్‌ హెచ్‌ఆర్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:44 AM