Share News

సుబ్బారాయుడి సేవలో గ్రెనడా హై కమిషనర్‌

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:39 AM

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వెస్టిండిస్‌ (గ్రెనడా) హై కమిషనర్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా పసుపులేటి గీతా కిషోర్‌కుమార్‌ శనివారం ఉదయం విచ్చేశారు.

సుబ్బారాయుడి సేవలో గ్రెనడా హై కమిషనర్‌
గ్రెనడా హై కమిషనర్‌ పసుపులేటి గీతా కిషోర్‌కుమార్‌కు స్వామి చిత్రపటం అందిస్తున్న ఈవో డి.శ్రీరామవరప్రసాదరావు

మోపిదేవి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి వెస్టిండిస్‌ (గ్రెనడా) హై కమిషనర్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా పసుపులేటి గీతా కిషోర్‌కుమార్‌ విచ్చేశారు. ఆలయ అధికారులు, అర్చక బృందం ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలుపోసి స్వామిని దర్శించుకుని విశేష పూజలు చేశాక, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికి శేషవస్త్రాలతో ఆయనను సత్కరించారు. స్వామి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ ఈవో డి.శ్రీరామవరప్రసాదరావు అందజేశారు.

Updated Date - Jan 02 , 2025 | 12:39 AM