Sankharavam: శంఖారావం సభలో పాల్గొననున్న వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు..
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:05 AM
కృష్ణా జిల్లా: గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు రాష్ట్రాల నుంచి వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సభా ప్రాంగణానికి నలువైపులా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్‌తో జాతీయ ఉద్యమం చేపట్టారు.
కృష్ణా జిల్లా: గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం (Hindu Sankharavam) బహిరంగ సభ (Public Meeting) ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు హిందూ బంధువులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సభా ప్రాంగణానికి నలువైపులా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి గన్నవరం నాలుగు వైపుల ట్రాఫిక్ మళ్లించారు. ఆలయాల పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్‌తో జాతీయ ఉద్యమం చేపట్టారు. దేశ వ్యాప్త పోరాటానికి విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో హైందవ శంఖారావం సభలు నిర్వహించనున్నారు. ఆదివారం జరిగే శంఖారావ సభలో వీహెచ్‌పీ (VHP) జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత సభ ప్రారంభం కనుంది.
భారతీయ సంస్కృతి, జానపద కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్ నినాదంతో సభా ప్రాంగణం, రోడ్లు, మారు మోగుతున్నాయి. హిందూ జాతీయ ఉద్యమానికి మూడు లక్షల మందితో తొలి సభకు ఆదివారం అంకురార్పణ చేశారు. హైందవ శంఖారావానికి తూర్పుగోదావరి జిల్లా విశ్వహిందూ దర్మపరిరక్షణ రామసేన అద్యక్షుడు, కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆధ్యాత్మికవేత్తలు సభకు బయలుదేరారు. హైందవ శంఖారావానికి కంబాల శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా నుంచి 50 బస్సులు ఏర్పాటు చేశారు.
కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 30 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. 150 మంది స్వామీజీలు కూర్చునేందుకు భారీ స్టేజీ నిర్మించారు. 50 గ్యాలరీల్లో లక్షకు పైగా కుర్చీలు వేశారు. సభకు వచ్చిన వారు వీక్షించేందుకు 14 భారీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. సభాస్థలికి నాలుగు మార్గాల్లో వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్‌కు కంకిపాడు రోడ్డు, సావరగూడెం రోడ్డులో 150 ఎకరాలకుపైగా భూములను చదును చేశారు. అక్కడ మార్కింగ్‌లు వేసి వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేపట్టారు. 3500 బస్సులు, 7రైళ్లు, 20వేల బైకులలో హిందూ కుటుంబీకులు వస్తున్నారని చెబుతున్నారు. రైళ్లల్లో వచ్చేవారికి ఉప్పులూరు స్టేషన్ వద్ద దిగి సభకు వచ్చేటప్పుడు అల్పాహారం, భోజనాలు, మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు. చేశారు. అయోధ్య రామాలయం ట్రస్టు కోశాధికారి గోవిందగిరి మహరాజ్‌తో పాటు దేశంలోనే ప్రధాన స్వామీజీలు హాజరవుతున్నారు. స్టేజీ మీద స్వామీజీలు మాత్రమే కూర్చుంటారు. ఏర్పాట్లను వీహెచ్‌పీ అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, కన్వీనర్ తనికెళ్ల సత్య రవికుమార్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలను నిర్మించి కుర్చీలు వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్
నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..
విశాఖ కలెక్టరేట్‌లో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం
కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి ఆత్మహత్య..
గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కరించిన మంత్రి లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News