Share News

రేపటి నుంచి జోసఫ్‌ తంబి తిరునాళ్ల

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:16 AM

పెదఅవుటపల్లిలోని సుప్రసిద్ధ కతోలికా పుణ్యక్షేత్రంలో ఈనెల 13నుంచి 15వరకు(మూడురోజులపాటు) బ్రదర్‌ జోసఫ్‌ తంబి 80వ వర్ధంతి మహోత్సవాల(తిరునాళ్ల)ను నిర్వహించనున్నారు.

రేపటి నుంచి జోసఫ్‌ తంబి తిరునాళ్ల

అన్ని ఏర్పాట్లు చేశాం: రెక్టర్‌ రెవరెండ్‌ ఫాదర్‌ పాలడుగు జోసఫ్‌

ఉంగుటూరు: పెదఅవుటపల్లిలోని సుప్రసిద్ధ కతోలికా పుణ్యక్షేత్రంలో ఈనెల 13నుంచి 15వరకు(మూడురోజులపాటు) బ్రదర్‌ జోసఫ్‌ తంబి 80వ వర్ధంతి మహోత్సవాల(తిరునాళ్ల)ను నిర్వహించనున్నారు. ఆ మూడురోజులూ భక్తులు ప్రశాంత వాతావరణంలో దైవదర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరేలా, ఉత్సవాలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని తంబి పుణ్యక్షేత్రం రెక్టర్‌ రెవరెండ్‌ ఫాదర్‌ పాలడుగు జోసఫ్‌ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తాగునీరు, శానిటేషన్‌, విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. స్థానిక రైల్వేస్టేషన్లో నాలుగు ఎక్స్‌ప్రె్‌సరైళ్లు ఆగేలా, అన్ని ఆర్టీసీ డిపోలనుంచి బస్సు సర్వీసులు నడిపేలా ఆయాశాఖల ఉన్నతాధికారులనుంచి అనుమతి తీసుకున్నామన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:16 AM