విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడండి
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:37 AM
హిందూ కళాశాల క్రీడా ప్రాంగణంలో జనవరి 3,4 తేదీల్లో నిర్వహించనున్న యువకెరటాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది విద్యార్థులు వస్తున్నందున వారికి ఏ అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.
‘యువకెరటాలు’ ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్ బాలాజీ
మచిలీపట్నం టౌన్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): హిందూ కళాశాల క్రీడా ప్రాంగణంలో జనవరి 3,4 తేదీల్లో నిర్వహించనున్న యువకెరటాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది విద్యార్థులు వస్తున్నందున వారికి ఏ అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. హిందూ కళాశాల ప్రాంగణంలో యువకెరటాలు కార్యక్రమ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. మెప్మా పీడీ సాయిబాబు, ఎంఈవో దుర్గాప్రసాద్, ప్రైవేట్ పాఠశాలల సంఘ రాష్ట్ర నాయకులు కొమరగిరి చంద్రశేఖర్, వి.సుందరరాం, నిర్వాహకుడు ఆనంద్, పోలీసు అధికారులు, మునిసిపల్ ఇంజనీర్లు, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పాల్గొన్నారు.