Share News

Lokesh Criticizes Jagan: మీరు వదిలేశారు.. మేం చేసి చూపిస్తున్నాం.. జగన్‌కు లోకేష్ కౌంటర్

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:17 AM

Lokesh Criticizes Jagan: గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో విధ్వంసాలకు పాల్పడ్డారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఆర్థిక భారంగా మారినా విడతల వారీగా విడుదల చేస్తున్నామని తెలిపారు.

Lokesh Criticizes Jagan: మీరు వదిలేశారు.. మేం చేసి చూపిస్తున్నాం.. జగన్‌కు లోకేష్ కౌంటర్
Lokesh Criticizes Jagan

అమరావతి, మార్చి 22: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పాలనలో అంతా విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. మీ బకాయిలు మేమెందుకు చెల్లించాలనే విధంగా వైసీపీ పాలన సాగిందాన్నారు. అన్ని అభివృద్ధి పనులను నిలిపివేశారని, విధ్వంసాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించిన విధంగా తాము ప్రవర్తించడం లేదన్నారు. గత ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం శాశ్వతమనే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని హితవుపలికారు మంత్రి లోకేష్.


లోకేష్ వ్యాఖ్యలు ఇవే..

‘ప్రభుత్వం శాశ్వతం.. రాజకీయాలు ఎన్నికలకే పరిమితం.. అని ఇప్పటికైనా తెలుసుకోండి జగన్ రెడ్డి గారు’ అంటూ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం మారినా అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని వైసీపీ విధ్వంస పాలనతో బ్రేక్ చేశారని మండిపడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ గత ప్రభుత్వ బకాయిలు తామెందుకు చెల్లించాలి అంటూ మొండికేశారన్నారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను నిలిపేశారని.. అంతేకాకుండా మరికొన్ని ధ్వంసం చేశారన్నారు. ఈ నిరంకుశ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పుకొచ్చారు.

IPL 2025: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ బ్యాటింగ్ మాఫియా కుట్రనా


ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. ‘మా విద్యాశాఖలో మీరు పెట్టి వెళ్లిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4271 కోట్లు. ఇవి విడతల వారీ చెల్లిస్తామని మాట ఇచ్చాను. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేసిన మా ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. త్వరలో మరో రూ.400 కోట్లు విడుదల చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఆర్థిక భారంగా మారినా, చివరి రూపాయి వరకూ బకాయిలు చెల్లించడం, విద్యార్థులు, తల్లిదండ్రు పై ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

Baroda MDGinext Mobile App: ఆ కస్టమర్ల కోసం బీవోబీ సరికొత్త ప్రయత్నం.. ఇంత అంతా సులువే

CM Chandrababu Tweet: సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్.. లైట్లు ఆపేయాలంటూ..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 22 , 2025 | 12:51 PM