ఆంధ్రా లయోలా కళాశాలకు నోటీసులు
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:46 AM
నిబంధనలను ఉల్లంఘించిందని విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలకు కృష్ణా యూనివర్సిటీ రిజిస్ర్టార్ శోభన్‌బాబు ఈనెల 7వతేదీన నోటీసులు జారీచేశారు.
నిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరిన కృష్ణా యూనివర్సిటీ
మచిలీపట్నం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): నిబంధనలను ఉల్లంఘించిందని విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలకు కృష్ణా యూనివర్సిటీ రిజిస్ర్టార్ శోభన్‌బాబు ఈనెల 7వతేదీన నోటీసులు జారీచేశారు. ఇటీవల ముగ్గురు సభ్యులతో కూడిన బృందం లయోలా కళాశాలను పరిశీలించింది. పలు నిబంధనలను ఉల్లఘించినట్లు గుర్తించింది. అటానమస్ హోదా ఉన్న లయోలా కళాశాల పలు నివేదికలను యూనివర్సిటీకి పంపకుండా జాప్యం చేసిందని, ఈ అంశంపై ఈనెల 9వతేదీలోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కళాశాల పరిపాలనాపరమైన అంశాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించకపోవడం, కళాశాల ప్రణాళికలు, జవాబుపత్రాల మూల్యాంకనం, పరీక్షల నిర్వహణ, నూతన కోర్సులను ప్రవేశపెట్టడం, అకడమిక్ కార్యక్రమ్రాల వివరాలను తెలియజేయకుండా ఉంచారని పేర్కొన్నారు. కళాశాలకు అటానమస్ హోదా గడువు ముగిసినా పొడిగించకపోవడం, వివిధ కోర్సుల్లో అనుమతులు లేకుండా విద్యార్థులను చేర్చుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఫీజులు పెం చారని, ఈ విషయాలను యూనివర్సిటీకి తెలియజేయలేదని నోటీసులో పేర్కొన్నారు.