Share News

అయ్యప్పను దర్శించకుండానే అనంతలోకాలకు

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:39 AM

అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమల సన్నిధానంలో అయ్యప్పను దర్శించకుండానే ఓ భక్తుడు కన్నుమూశాడు.

అయ్యప్పను దర్శించకుండానే అనంతలోకాలకు
ఆకుల నాగవిజయ్‌బాబు(ఫైల్‌)

శబరిమల యాత్రలో విషాదం..గుండెపోటుతో చల్లపల్లివాసి మృతి

చల్లపల్లి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమల సన్నిధానంలో అయ్యప్పను దర్శించకుండానే ఓ భక్తుడు కన్నుమూశాడు. పంబ నుంచి నడిచి వెళుతూ గుండెపోటుతో కుప్పకూలా డు. ఈ విషాదకర ఘటన చల్లపల్లి, పెదప్రోలు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చల్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల నాగ విజయ్‌బాబు(40) సహచరులతో కలిసి అయ్యప్పస్వామి దర్శనానికి సోమవారం శబరిమల బయలుదేరాడు. స్వాములతో కలిసి మంగళవారం రాత్రి పంబ చేరుకుని బుధవారం తెల్లవారుజామున శరంగుత్తి వద్ద నడుస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి తల్లిదండ్రులు, భా ర్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విజయ్‌బాబు స్వగ్రామం మోపిదేవి మండలం పెదప్రోలు, కాగా చల్లపల్లిలో గ్యాస్‌ కంపెనీ వద్ద నివాసముం టున్నాడు. కఫ్తానుపాలెం రైస్‌మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆ యన అయ్యప్ప దీక్ష తీసుకోవడం 12వ సారి అని బంధువులు తెలిపా రు. విజయ్‌ భౌతికకాయం గురువారం గ్రామానికి చేరుకుంటుందన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 01:39 AM