Share News

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:35 AM

నగరవాసులంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఇందులో భాగంగా రూ.35 లక్షలతో జేసీబీ కమ్‌ డోజర్‌ను కొనుగోలు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం
పారిశుధ్య నిర్వహణ కోసం నగరపాలక సంస్థ రూ.35 లక్షలతో కొనుగోలు చేసిన జేసీబీని ప్రారంభిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

నగరవాసులంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): నగరవాసులంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఇందులో భాగంగా రూ.35 లక్షలతో జేసీబీ కమ్‌ డోజర్‌ను కొనుగోలు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నూతనంగా కొనుగోలు చేసిన యంత్రాన్ని తన ఇంటి వద్ద మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ప్రారంభించారు. స్వయంగా యంత్రాన్ని నడిపారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కమిషనర్‌ బాపిరాజు, టీడీపీ సీనియర్‌ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, గోకుల శివ, ఎండీ ఇలియాస్‌ పాషాతో పాటు ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసరావు, మునిసిపల్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 12:35 AM