Jathvani False Cases: సీఎం, హోంమినిస్టర్.. న్యాయం చేయండి ప్లీజ్
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:30 PM
Jathvani False Cases: తనపై తప్పుడు కేసులు పెట్టారని, తన కుటుంబాన్ని ఎన్నో వేధింపులకు గురిచేశారని, తనకు న్యాయం చేశారని ముఖ్యమంత్రి, హోంమంత్రికి ముంబై నటి కాదంబరి జత్వానీ వినతి చేశారు.

విజయవాడ, మార్చి 17: ముంబై నటి కాదంబరి జత్వానీకి (Mumbai actress Kadambari Jatwani) మహిళా ఐక్య వేదిక మద్దతుగా నిలిచింది. జత్వానీపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని, మహిళలపై వేధింపుల కేసులు త్వరితంగా పరిష్కరించాలని మహిళా ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నటి జత్వానీ మాట్లాడుతూ... తన మీద పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మినిస్టర్ వంగలపూడి అనిత తనకు న్యాయం చేయాలన్నారు. ‘నేను, నా కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. నా కుటుంబం ఎన్నో వేధింపులకు గురైంది. నా మీద ఎన్నో అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారు.. వాటన్నింటినీ వెంటనే తీసివేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు.
ఇంత వరకు ఫారెన్సీక్ రిపోర్టు రాలేదన్నారు. తన కేసును సీఐడీకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంత వరకు నిందితుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని తెలిపారు. కుక్కల విద్యాసాగర్ బెయిలు మీద బయటకు వచ్చి యెదేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. కుక్కల విద్యాసాగర్, జిందాల్ ఢిల్లీ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ పెట్టి తనను వేధిస్తున్నారని తెలిపారు. విద్యాసాగర్ వెనక జిందాల్ ఉండి నడిపిస్తున్నారని నటి జత్వానీ వాపోయారు.
Pawan Kalyan on NREGS: ఉపాధి హామీ పథకంలో అవకతవకలను బయటపెట్టిన పవన్
సుంకర పద్మశ్రీ, ఐద్వా రమా దేవి కామెంట్స్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వానీ కేసు గాలికి వదిలేశారని సుంకర పద్మశ్రీ, ఐద్వా రమా దేవి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను అసభ్య పదాజాలంతో దూషించారని వెంటనే యాక్షన్ తీసుకున్నారని.. మహిళలపై జరిగే అగాయిత్యాల కేసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని, వేలాది మంది మహిళలు వైసీపీ ప్రభుత్వ పాలనలో అదృశ్యమయ్యారని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. జత్వానీపై పెట్టిన అక్రమ కేసులన్నీ ప్రభుత్వం వెంటనే తొలగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు.
కాగా.. గత ప్రభుత్వ హయాంలో నటి జత్వానీ చిత్రహింసలకు గురైన విషయం తెలిసిందే. ఓ పారిశ్రామికవేత్తపై జత్వానీ పెట్టిన కేసును వెనక్కి తీసుకునేందుకు నటిపై ఇబ్రహింపట్నంలో కేసు నమోదు అయ్యింది. దీంతో ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై నటి ఫిర్యాదు చేయగా.. సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అలాగే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఎన్నోసార్లు విద్యాసాగర్ బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించగా.. ఎట్టకేలకు అతడికి బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం..సీఐడీకి కేసును అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఐడీ విచారణ ప్రారంభించగా.. జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్
Read Latest AP News And Telugu News