Share News

Big Shock To Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:07 PM

Big Shock To Jagan: అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిగ్ షాక్ తగిలింది. పలు ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Big Shock To Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం
Jagan Case

అమరావతి, ఏప్రిల్ 17: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారతి సిమెంట్స్ కార్పొరేషన్‌కు సంబంధించి ఈ‌డీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పునీత్ దాల్మియా కంపెనీలకు చెందిన రూ.793 కోట్ల ఆస్తులు జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. దాల్మియా భారత్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ.. ఆ ఆస్తుల్లో దాదాపు రూ.377 కోట్ల విలువైన భూమి భారతి సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో జరిగిందన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనులు, భారతి సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్ పెట్టుబడి పెట్టింది. 2011లో సీబీ‌ఐ కేసు నమోదు చేసింది. 2013లో చార్జిషీటు దాఖలు చేశారు. సీ‌బీఐ ఎఫ్‌ఐ‌ఆర్‌ల ఆధారంగా ఈ కేసులో ఈడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసింది.


Tirupati Hostel Incident: విద్యార్థినిల గదిలోకి ప్రిన్సిపాల్.. తిరుపతిలో దారుణం

భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టినవారిపై దర్యాప్తు జరిపింది ఈడీ. సున్నపు రాయి గనుల లీజులో ఆయాచితి లబ్ది పొందిన వారి ఆస్తులను కూడా జప్తు చేసింది. పునీత్ దాల్మియాకు, విజయసాయి రెడ్డికి మధ్య డీల్ కుదిరిందన్న విషయాన్ని సీబీఐ చెప్పింది. ఫ్రాన్స్‌కు చెందిన పాసిఫామ్‌కు వాటాలో కొంత భాగాన్ని దాల్మియా అమ్మింది. వచ్చిన సొమ్ములో రూ.55 కోట్లు జగన్‌కు బదిలీ చేశారని సీబీఐ అభియోగాలను మోపింది. 2010 నుంచి 2011 మధ్య హవాలా ద్వారా లావాదేవీలు జరిగాయని సీ‌బీ‌ఐ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ఐటీ సోదాల్లో లభ్యమైన డీల్‌కు సంబందించిన వివరాలు, ఆధారాలు బయటపడ్డాయి. దీంతో రూ.793 కోట్ల ఆస్తులు జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్

Mithun Reddy High Court: ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 17 , 2025 | 04:21 PM