Share News

వంక దాటుతూ 50 గొర్రెలు మృతి

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:42 AM

మండలంలోని లద్దగిరి శివారులో ఓటుకుంట వాగు దాటుతూ ప్రమాదవశాత్తు 50 గొర్రెలు మృతి చెందాయి.

వంక దాటుతూ 50 గొర్రెలు మృతి
మృతి చెందిన గొర్రెలను పరిశీలిస్తున్న పశువైద్యాధికారి

రూ. 8 లక్షలు నష్టం

కోడుమూరు రూరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లద్దగిరి శివారులో ఓటుకుంట వాగు దాటుతూ ప్రమాదవశాత్తు 50 గొర్రెలు మృతి చెందాయి. కొండాపురం, లద్దగిరి గ్రామాలకు చెందిన గొర్రెల కాపరులు సుమారు 2 వేల గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఓటుకుంటవాగు పరిసరాల్లో కంది పొలాల కోత జరగడంతో మేతకు తరలించారు. అయితే మధ్యాహ్నం ఒక పొలం నుంచి మరొక పొలానికి వెళుతుండగా వాగు దాటాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముందుగా దిగిన గొర్రెలు నీళ్లు తాగుతుండగా ఆ వెనుకనే వచ్చిన గొర్రెలు నీళ్లు తాగేవాటిపై పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన కాపరులు గొర్రెలను అవతలి గట్టుకు లాగేశారు. అప్పటికే గొర్రెలు చనిపోయాయి. ప్రకా్‌షకు చెందిన 4 గొర్రెలు, బోయ మధు 16, చిన్నఓబులేష్‌ 1, భాస్కర్‌ 3, గొల్ల గోపాల్‌ 2, అయ్యస్వామి 9, బోయ గోపాల్‌ 4, ఉల్చాల మద్దిలేటి 2, కురువ గిడ్డయ్య 6, కురువ మధు 1, బోయ రంగడుకు చెందిన 2 గొర్రెలు మృతి చెందాయి. పశువైద్యాధికారి డాక్టర్‌ అమృతరెడ్డి, వీఆర్వో శేఖన్న వచ్చి మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు రూ. 8 లక్షలు నష్టపోయామని గొర్రెల కాపరులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Updated Date - Jan 04 , 2025 | 12:42 AM