మంత్రి బీసీకి దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:35 AM
రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కార్యాలయానికి ఆదివారం వందలాదిగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో సమర్పించారు.
బనగానపల్లె, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కార్యాలయానికి ఆదివారం వందలాదిగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో సమర్పించారు. ప్రజా సమస్యలను ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బనగానపల్లె కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయం చేరుకోవడంతో మంత్రి స్వయంగా అర్జీలను స్వీకరించారు. అధికారులు ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దన్నారు. ప్రజలను వేధించే అఽధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి వివిధ వర్గాల ప్రజలు కూటమి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. బాధిత ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించి . న్యాయ బద్ధంగా ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అనంరతం మంత్రి మాట్లాడుతూ దరఖాస్తులను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించడం పట్ల అర్జీదారులు మంత్రికి కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి ఎన్‌డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
రింగ్‌రోడ్డు పనులకు నేడు భూమి పూజ
బనగానపల్లె పట్టణంలో రూ.50 కోట్లతో నిర్మించనున్న రింగ్‌రోడ్డు పనులకు సోమవారం ఉదయం 9.30 గంటలకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి భూమి పూజ చేయనున్నట్లు ఆర్‌ఆండ్‌బీ ఏఈ హుసేన్ ఆదివారం తెలిపారు. పాణ్యం రహదారిలో రింగ్ రోడ్డు పనులకు మంత్రి భూమి పూజ చేయనున్నారని చెప్పారు.