Share News

గంజాయి కేసులో నిందితుల అరెస్టు

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:35 AM

ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు డీఎస్పీ పి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల తాలుకా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.ఈశ్వరయ్య, ఎస్‌ఐ ఎస్‌.గంగయ్య యాదవ్‌, ఏఎస్సై కె.హరినాథరెడ్డి సిబ్బంది శనివారం గంజాయి కేసులో నిందితులను అరె్‌స్ట చేశారు.

గంజాయి కేసులో నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

నంద్యాల క్రైం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆదేశాల మేరకు డీఎస్పీ పి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల తాలుకా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.ఈశ్వరయ్య, ఎస్‌ఐ ఎస్‌.గంగయ్య యాదవ్‌, ఏఎస్సై కె.హరినాథరెడ్డి సిబ్బంది శనివారం గంజాయి కేసులో నిందితులను అరె్‌స్ట చేశారు. శిరివెళ్ల మండలం బోయలకుంట్ల గ్రామానికి చెందిన జింకల మద్దిలేటి, మహదేవపురంకు చెందిన బొంత శ్రీనివాసులు, నంద్యాల మండలం అయ్యలూరు మెట్టకు చెందిన షేక్‌ యూసుఫ్‌లను శనివారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో అరె్‌స్టచేసి వారి వద్ద నుంచి 5కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడైన జింకల మద్దిలేటికి సామర్లకోటకు చెందిన వాసు అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వాసు సహాయంతో ప్రధాన నిందితుడు జింకల మద్దిలేటి రైలు ద్వారా గంజాయిని తెప్పించుకొని నంద్యాల, చుట్టుపక్కల గ్రామాలలో ఏ2 నిందితుడు బొంత శ్రీనివాసులుతో కలిసి గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటుండేవారన్నారు. శనివారం ఏ3 నిందితుడు షేక్‌ యూసు్‌ఫకు గంజాయి ఇస్తుండగా నంద్యాల తాలుకా పోలీసులు దాడిచేసి పట్టుకున్నట్లు చెప్పారు. ఏ1 నిందితుడు జింకల మద్దిలేటిపై గతంలో అవనిగడ్డలో, మహానంది పోలీస్‌ స్టేషన్‌లోనూ గంజాయి కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల అరె్‌స్టలో కీలకపాత్ర పోషించిన నంద్యాల తాలుకా సీఐ ఆర్‌.ఈశ్వరయ్య, ఎస్సై ఎస్‌.గంగయ్య యాదవ్‌, ఏఎస్‌ఐ కె.హరినాథరెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు చంద్రశేఖర్‌, పి.అయూబ్‌ఖాన్‌, పోలీస్‌ కానిస్టేబుళ్లు డి.జిలానిబాష, రామ్‌గోపాల్‌, పీవీకేనాయుడు, గంగాధర్‌లను ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా, డీఎస్పీ పి.శ్రీనివాసరెడ్డి అభినందించారు. గంజాయికి సంబంధించి 1972 నెంబర్‌కు కాల్‌ చేసి సమాచారం అందించాలని పోలీస్‌ అధికారులు ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు

Updated Date - Jan 05 , 2025 | 12:36 AM