ఘనంగా భోగి
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:51 PM
సంక్రాంతి పండుగలో భాగంగా సోమవారం భోగిని పట్టణవాసులు చేసుకున్నారు. కిలిచిన్ పేట అంబాభవాని ఆలయ ఆవరణలో తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు. మహిళలు ఇంటిముంగిట రంగురంగుల ముగ్గులు వేశారు. జిందేశంకర్, ఆదిశేషులు, జిందే హుళ్ళి శంకర్, రఘునాథ్, నాగరాజు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో వేడుకలు
భోగి మంటల వద్ద సందడి
ఆదోని అగ్రికల్చర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగలో భాగంగా సోమవారం భోగిని పట్టణవాసులు చేసుకున్నారు. కిలిచిన్ పేట అంబాభవాని ఆలయ ఆవరణలో తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు. మహిళలు ఇంటిముంగిట రంగురంగుల ముగ్గులు వేశారు. జిందేశంకర్, ఆదిశేషులు, జిందే హుళ్ళి శంకర్, రఘునాథ్, నాగరాజు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా భోగి వేడుకలు
ఆలూరు: మండలంలో సోమవారం భోగి వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఎన్జీవో కాలనీవాసులు మంటలు వేసుకు న్నారు. ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. అన్నివీధుల్లో రంగురంగుల ముగ్గులను
భోగి సంబరాలు..
తుగ్గలి: మండలంలో భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజా మునే మహిళలు ముగ్గులు వేసి రంగులు చల్లి, గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేశారు. అలాగే యువతీ యువకులు భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు.
మద్దికెర: మండలంలోని మద్దికెర, పెరవలి, ఎం.అగ్రహారం తదితర గ్రామాల్లో భోగి పండుగను జరుపుకున్నారు. సోమవారం సంక్రాంతి పురస్కరించుకుని బోగి పండుగను తెల్లవారుజామునే పాత వస్తువులను తెచ్చి భోగి మంటల్లో వేశారు.
ఘనంగా భోగి
వెల్దుర్తి టౌన్: పట్టణం, గ్రామాల్లో భోగి పండుగను సోమవారం చేసుకున్నారు. ఉదయం వీధుల్లో చిన్నారులు భోగి మంటలు వేసి ఆటల పాటలతో ఉల్లాసంగా గడిపారు. మహిళలు రంగు రంగుల ముగ్గులతో అలరించారు.