Share News

బుడ్డా వెంగళరెడ్డి సేవలు నేటి తరానికి అందించాలి : మంత్రి బీసీ

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:44 AM

రేనాటి చంద్రు డిగా ఖ్యాతికెక్కిన ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి చేసిన దానఽ దర్మాల చరిత్ర, ఆయన సేవలు నేటి తరానికి అందించాల్సిన అవస రం ఎంతో ఉందని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.

బుడ్డా వెంగళరెడ్డి సేవలు నేటి తరానికి అందించాలి : మంత్రి బీసీ
‘రేనాటి చంద్రుడు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

కర్నూలు కల్చరల్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రేనాటి చంద్రు డిగా ఖ్యాతికెక్కిన ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి చేసిన దానఽ దర్మాల చరిత్ర, ఆయన సేవలు నేటి తరానికి అందించాల్సిన అవస రం ఎంతో ఉందని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం బనగానపల్లిలోని మంత్రి కార్యాల యంలో ‘రేనాటి చంద్రుడు’ పుస్తకం (నవల) ఆయన ఆవిష్కరిం చారు. పుస్తక రచయిత, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబు లయ్య పుస్తకంలో బుడ్డా వెంగళరెడ్డి జీవిత విశేషాలను, ఆయన చేసిన దానధర్మాలను మంత్రికి వివరించారు. ఈ సంద ర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ ఒకప్పుడు రాష్ట్రంలో కరువు తాండవి స్తున్న కాలంలో జిల్లాలో డొక్కల కరువుగా మారిందని, అప్పుడు బుడ్డా వెంగళరెడ్డి గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి, అన్నార్థులకు అండగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆనాడు ప్రజలకు అందించిన సేవలను ఈనాటి తరానికి తెలియజేసేలా పుస్తకాన్ని ముందుకు తీసుకురావడం అభినందనీమని పుస్తక రచయిత పత్తి ఓబులయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం ఉపాధ్యక్షుడు సీవీ రెడ్డి, బనగానపల్లె అరుణభారతి సంస్థ అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 01:44 AM