Share News

షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ చేయాలి

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:55 AM

షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ త్వరగా చేయాలని ఏపీ ఎమార్పీ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు.

షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ చేయాలి
రాజీవ్‌ రంజన మిశ్రాకు వినతి పత్రం ఇస్తున్న దండు వీరయ్య మాదిగ

ఎస్సీ ఉపకులాల ఏకసభ్య కమిషన చైర్మనకు నాయకుల వినతి

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ త్వరగా చేయాలని ఏపీ ఎమార్పీ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో ఎస్సీ ఉపకులాల ఏకసభ్య కమిషన చైర్మన రాజీవ్‌ రంజన మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో భైరాపురం రాజు, సుధాకర్‌, ప్రతాప్‌, పూలరాజు, సూరిబాబు, సోల్మాన, విహార్‌, రాజశేఖర్‌, సుజాత, అయ్యమ్మ, రాధమ్మ పాల్గొన్నారు.

మాదిగలకు న్యాయం చేయాలి: ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొందిమడుగుల టీఎం రమేష్‌ మాదిగ అన్నారు. గురువారం చైర్మన రాజీవ్‌ రంజన మిశ్రాకు వినతి పత్రం అందజేశారు.

క్రిమిలేయర్‌ వర్తింపజేయాలి: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సంవత్సరానికి 15 లక్షల వార్షికాదాయం ఉంటే.. వారికి క్రిమిలేయర్‌ను వర్తింపజేయా లని జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ ఆంధ్రప్రదేశ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కిం జానయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. గురువారంచైర్మన రాజీవ్‌ రంజన మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాదిగ రత్నం, సత్యన్న మాదిగ, వీరపోగు సోమన్న, కాశపోగు సూరిబాబు, కాశపోగు పాల్గొన్నారు.

కర్నూలు న్యూసిటీ: రాష్ట్రంలో ఎస్సీ వర్గీక రణపై బీజేపీ, టీడీపీ కుట్రలను వ్యతిరేకిస్తున్నామని రాయలసీమ మాల మహానాడు రాష్ట్ర నాయకుడు యాట ఓబులేసు అన్నారు. గురువారం సునయన ఆడిటోరి యంలో షెడ్యూల్డ్‌ కులాల్లోని ఉప వర్గీకరణపై జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తున్న ఎస్సీ ఉపకులాల ఏకసభ్య కమి షన చైర్మన రాజీవ్‌ రంజన మిశ్రాకు మాల మహానాడు నాయకులు వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రద్దుతో పాటు ఆర్టికల్‌ 341 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ను, క్రిమిలేరు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మాధవస్వామి, ఎంవీ స్వామి, శీలం శేషు, నాగరాజు, నాగేష్‌ పాల్గొన్నారు.

కర్నూలు అర్బన: షెడ్యుల్డ్‌ కూలలను ఏబీసీడీలుగా వర్గీకరించి న్యాయం చేయాలని రాయలసీమ మాదిగ దండోరా వ్యవస్థపక అధ్యక్షు డు అనంతరత్నం మాదిగ కోరారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ఎస్సీ ఉపకులాల ఏకసభ్య కమిషన చైర్మన రాజీవ్‌ రంజనను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం మల్లికార్జున, బాలరాజు, పరమేష్‌, సాములు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 12:55 AM