పోటా పోటీ..
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:47 AM
ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మెన్ పదవిపై తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పదవి కోసం ప్రయత్నాలు ఆరంభించారు.
ఆలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నాయకుల ప్రయత్నాలు
తెరపైకి పత్తిపాడు ఎమ్మెల్యే సోదరుడు?
పదవి ఎవరిని వరించేనో?
ఆలూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మెన్ పదవిపై తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పదవి కోసం ప్రయత్నాలు ఆరంభించారు. చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వు కావడంతో ఆ వర్గానికి చెందిన నాయకులు ఇప్పటికే ఆపార్టీ ముఖ్యనేతల అనుగ్రహం పొందేందుకు నానాపాట్లు పడుతున్నారు.
మద్దతు కూడగట్టుకునే యత్నం...
ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమైన పది కావడతో టీడీపీలోని దళిత నాయకులు ముఖ్యనా యలకు ఫోన్లు చేసి మద్దతు కూడ గగడుతున్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల పార్టీ కన్వీనర్లకు ఫోన్ చేసి లెటర్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. హొళగుంద మండలానికి చెందిన సీనియర్ నాయకుడు చిన్నహ్యట శేషగిరి, ఆలూరుకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు చెన్నంగి నరసప్ప, బిల్లేకల్ వెంకటేష్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బెంగళూర్ కిషోర్, టీడీపీ నాయకులు కొమ్ము రాజు పదవిని ఆశిస్తున్నారు.
ఎమ్మెల్యే సోదరుడు కూడా..
పదవి కోసం ఇప్పటికే పార్టీలోని నాయకులు పోటీ పడుతుండగా అనూహ్యంగా గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజినేయులు సోదరుడు త్యాగరాజు పేరు తెరపైకి వచ్చింది. ఈయన పట్ల టీడీపీ ఇన్‌చార్జి వీరభధ్ర గౌడ్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై ఈనెల 5న ఎమ్మెల్యే రామాంజినేయులు ఆలూరుకు రానున్నట్లు సమాచారం. మరి చర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి