గొర్రెలకు మేతగా కొత్తి మీర పంట
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:04 AM
కొత్తిమీర ధర పడిపోయింది.
పడిపోయిన ధర.. కట్ట రూ.5
గోనెగండ్ల, జనవరి 4(ఆంధ్రజ్యోతి): కొత్తిమీర ధర పడిపోయింది. దీంతో వ్యాపారులు కొత్తిమీరను కొనేందుకు ముందుకు రావడం లేదు. పంటను సాగు చేసిన రైతులు చేసేంది లేక పంట అదును దాట డంతో మూగజీవాలకు మేతగా వదులుతున్నారు. గోనెగండ్లలోని కబుల్, మాబు అనే రైతులు తాము సాగు చేసిన కొత్తిమీరను శనివా రం మూగజీవాలకు మేతగా వదిలాడు. మండల వ్యాప్తంగా దాదాపు 500 ఎకరాల్లో కొత్తిమీరను సాగు చేశారు. కబుల్ అనే రైతు ఒక ఎకరంలో కొత్తిమీరకు రూ. 80వేలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశాడు. అయితే ధర లేక పోవడంతో వ్యాపారులు రాలేదు. దీంతో కొత్తి మీర రైతులు గ్రామంలో గంపలో కొత్తిమీర కట్టలు పెట్టుకొని రూ. 5లకు ఒక కట్ట అమ్మకాలు జరుపుకుంటున్నారు. అయితే పంట సాగు చేసి 40 రోజులు ముగియడంతో ఇక చేసేది లేక మూగ జీవాలకు వదిలివేస్తున్నారు. కొత్తి మీర రైతులను ప్రభుత్వం ఆదుకో వాలని రైతులు కోరుతున్నారు.