శ్రీమఠంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:34 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ట్రాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
.మంత్రాలయం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ట్రాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగాణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి దర్శన క్యూలైన్లు, పరిమళ ప్రసాదం కేంద్రాలు భక్తులతో సందడిగా మారాయి.