కిటకిటలాడిన వైష్ణవాలయాలు
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:39 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలో వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి.
నగరంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి
గోదా గోకులంలో భారీగా భక్తజనం
కిక్కిరిసిన హరిహర క్షేత్రం
‘ఉత్తర ద్వారం’లో దర్శించుకున్న భక్తులు
కర్నూలు కల్చరల్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలో వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. మామిదాలపాడులోని గోదా గోకుల క్షేత్రంలో గోదా రంగనాథస్వామికి ధనుర్మాస పూజలు నిర్వహించారు. వేకువ జామునే రంగనాథస్వామి వారికి, గోదాదేవి అమ్మవారికి శాసో్త్రక్తంగా పూజలు నిర్వహించి, ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోదా విష్ణు నిత్య సేవాధామ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. నగరంలోని సంకల్‌బాగ్ హరిహర క్షేత్రంలోని శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పిం చారు. వేకువ జామున 3 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీదేవీ, భూదేవి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రసన్న శర్మ, మహేష్ శర్శ, గురురాజారావులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, వసా్త్రలంకరణ, పూలంగి సేవలు పూర్తి చేసి, అనంతరం 4 గంటల నుంచీ భక్తులకు దర్శ నాలు కల్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ సతీమణి టీజీ రాజ్యలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత సతీమణి టీజీ శిల్పాభరత, టీజీ వెంకటేశ బంధుమిత్రులు ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించి, పూజాలు నిర్వహిం చారు. విశ్రాంత కలెక్టర్ రాంశంకర్ నాయక్ కుటుంబ సభ్యులు పాల్గొని పూజలు చేశారు. కాగా ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు ఆలయం వెలుపలి రోడ్డు వరకు బారులు తీసి నిలబడ్డారు. సుమారు 20వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీక రించారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్, కార్య దర్శి చల్లా నాగరాజ శర్మ, గౌరవాధ్యక్షుడు సీహెచ దుర్గాప్రసాద్, ఉపా ధ్యక్షుడు కంచుగంటల శ్యామ్‌సుందర్ రావు, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్, గౌరవ సలహాదారు టీవీ రవిచంద్రశర్మ, ఎస్ శ్రీనివాసరాజు, కృష్ణజ్యోతి, ఆలయ మేనేజర్ రాధాకృష్ణ, ఈసీ మెంబర్లు భక్తులకు సదుపాయాలతోపాటూ తీర్థప్రసాదాలు వితరణ చేశారు. రెండో పట్టణ పోలీసులు ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించారు. పాతనగరంలో జమ్మిచెట్టు సమీపంలోని లలితాపీఠంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాస కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు. లలితా పీఠం పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నెహ్రూనగర్‌లోని పుట్టపర్తి సాయిబాబా మందిరంలో సాయి సేవ సమితి అధ్యక్షుడు మాకా అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పూజలు జరిగాయి. బళ్లారి రోడ్డు వైజంక్షన సమీపంలోని వాసవీనగర్‌లో గల వేంకటేశ్వర స్వామిదేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు యాలిశెట్టి భద్రయ్య శెట్టి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వెంకటరమణ కాలనీలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆల యంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కృష్ణనగర్‌లోని శ్రీనివాస మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో వంద లాదిగా భక్తులు హాజరయ్యారు. పాతనగరంలోని మాలే బాలయ్య సత్రం లో, రామాలయంలో, రాంభొట్ల దేవాలయంలో, బి.క్యాంపులోని విజ్ఞాన మందిరం (శ్రీకృష్ణ మందిరం)లో, పార్కురోడ్డులోని ఇస్కాన మందిరంలో, మారుతీనగర్‌లోని శ్రీలక్ష్మీ నరసింహ సీతారామాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.