Share News

ప్రజలపై భారం మోపడాన్ని సహించం

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:53 PM

విద్యుత్‌ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారం మోపడం సహించమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య హెచ్చరిం చారు.

ప్రజలపై భారం మోపడాన్ని సహించం
జీవో ప్రతులను దహనం చేస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య

పత్తికొండ టౌన్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారం మోపడం సహించమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య హెచ్చరిం చారు. పెంచిన విద్యుత్‌ చార్జీల ప్రతులను అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద భోగి మంటల్లో దహనం చేశారు. అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా విద్యుత్‌ చార్జీలు పెంచుతుం డటంతో ప్రజలు భారం మోయలేకపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విద్యుత్‌ చార్జీలను ఇష్టానుసారంగా పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందన్నారు. కార్యదర్శులు రాజాసాహెబ్‌, రామాంజనేయులు, సభ్యులు సురేంద్ర కుమార్‌, కృష్ణయ్య, జయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 11:53 PM