Share News

శునకాలకు శస్త్ర చికిత్స నిర్వహించాలి

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:43 AM

శునకాలకు పకడ్బం దీగా శస్త్ర చిక్సితలు నిర్వహించాలని భారత జంతు సంక్షేమ మండలి సభ్యురాలు అంజలి గోపాలన నగర పాలక అధికారులకు సూచిం చారు.

శునకాలకు శస్త్ర చికిత్స నిర్వహించాలి
శునకాల సంతాన నిరోధక శాస్త్ర చికిత్స కేంద్రాన్ని పరిశీలిస్తున్న అంజలిగోపాలన

భారత జంతు సంక్షేమ మండలి సభ్యురాలు అంజలి గోపాలన

కర్నూలు న్యూసిటీ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): శునకాలకు పకడ్బం దీగా శస్త్ర చిక్సితలు నిర్వహించాలని భారత జంతు సంక్షేమ మండలి సభ్యురాలు అంజలి గోపాలన నగర పాలక అధికారులకు సూచిం చారు. శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రం నిర్వహణకు సంబంధించి అనుమతుల కోసం నగర పాలక సంస్థ భారత జంతు సంక్షేమ మండలికి దరఖాస్తు చేసుకుంది. అందులో భాగంగా మండలి సభ్యురాలు బుధవారం నగరానికి వచ్చారు. నగర శివారులోని గార్గేయ పురం డంప్‌యార్డులోని శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రా న్ని ఆమె సందర్శించారు. ఆమెకు నగర పాలక కమిషనర్‌ రవీంద్ర బాబు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె కేంద్రంలో ఉన్న శస్త్ర చిక్సిత గదులు, శునకాల బోను, తదితర సౌకర్యా లను పరిశీలించారు. నగరంలో శస్త్ర చికిత్సలు జరిగిన, ఇంకా జర గాల్సిన సంఖ్య, కేంద్రంలో శునకాలకు అందించే ఆహారం, శస్త్ర చికిత్స లు నిర్వహించే పద్ధతులపై ఆమె ఆరా తీశారు. శునకాలకు సంతాన నియంత్రణ క్షేత్ర చికిత్సలను పునఃప్రారంభించేందుకు నవోదయ సొసె ౖటీకి ప్రాజెక్టు రికగ్నేషన సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు అంజలి గోపాలన సాను కూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో కుక్కల బెడద నివారణకు త్వరలోనే సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. నగరంలో ఇప్పటికే 10054 శునకాలకు శస్త్ర చికిత్సలు జరిగాయని, ఇంకా 4 వేలకు పైగా వునకాలకు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందన్నారు. ఒక్కొక్క శునకానికి శస్త్ర చికత్స నిర్వహించేందుకు నగర పాలక రూ.1500 ఖర్చు చేస్తుందన్నారు. అనంతరం ఆమె అధికారులతో కలిసి కేంద్రం బయట మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆరోగ్య అధికారి కే.విశ్వేశ్వరరెడ్డి, ఎస్‌ఈ రాజశేఖర్‌, పశువైద్యాధికారి మల్దన్న, డీఈ గం గాధర్‌, ఏఈ వైష్ణవి, నవోదయ సొసైటీ అధ్యక్షుడు గిరిబాబు, పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. గతంలోనే శునకాల చికిత్సల కు సంబంధించి సొసైటీకి అనుమతి లేదని ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు నగర పాలక అధికారులు అనుమతుల కోసం భారత జంతు సంక్షేమ మండలికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మండలి సభ్యురాలు గార్గేయపురం డంప్‌యార్డులోని శున కాల సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించారు.

Updated Date - Jan 09 , 2025 | 12:43 AM