నంద్యాలలో తొలి బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టు
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:21 AM
రాష్ట్ర విభజన తరువాత అప్పటి సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం గుమ్మటంతాండ గ్రామాల మధ్య సోలార్, విండ్, హైడ్రో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక (రెన్యూవబుల్) ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ)కు శ్రీకారం చుడితే ఇది సాధ్యమేనా..? అంటూ పలువురు ప్రశ్నించారు.
గత టీడీపీ ప్రభుత్వంలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టు
తాజాగా సోలార్, విండ్ బ్యాటరీ స్టోరేజీ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు
కొలిమిగుండ్ల మండలంలో ఏర్పాటు చేసే అవకాశం
హోసూరు, పెద్దహుల్తి మధ్య సోలార్ యూనిట్
రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
కర్నూలు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తరువాత అప్పటి సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం గుమ్మటంతాండ గ్రామాల మధ్య సోలార్, విండ్, హైడ్రో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక (రెన్యూవబుల్) ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ)కు శ్రీకారం చుడితే ఇది సాధ్యమేనా..? అంటూ పలువురు ప్రశ్నించారు. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు ఎక్కడా వినలేదు అన్నారు. ఆనాడు చంద్రబాబు ఆలోచన నుంచి పురుడుపోసుకున్న 5,230 మెగా వాట్లా సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు మార్చి నెలలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా సోలార్, విండ్ బ్యాటరీ స్టోరేజీ ఇంటిగ్రేటెడ్ ప్రాజె క్టును నంద్యాల, కడప జిల్లాల్లో ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నంద్యాల, కడప జిల్లాల్లో క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 119 మెగావాట్ల పవన విద్యుత్, 130 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ ఇంధనంతో పాటు బ్యాటరీ ఇంధనం స్టోరేజీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే.. కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం హోసూరు, పెద్దహుల్తి గ్రామాల మధ్య 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా రూ.2 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. 1.380 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.