ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:10 AM
కల్లూరు అర్బన, రూరల్ మండ లంలో న్యూఇయర్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు
కల్లూరు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన, రూరల్ మండ లంలో న్యూఇయర్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి నివాసం టీడీపీ నాయకులు, కార్యకర్తల అఽధికారుల రాకతో కిక్కిరిసిపోయింది. పాణ్యం, నందికొట్కూరు నియోజ కవర్గాల నుంచి ప్రజలు పెద్దఎత్తున హాజరై పూలబోకేలు, పూలదండలు, శాలువాలు, పండ్లు, మిఠాయిలు అందించి గౌరు దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరు దంపతులను కల్లూరు మండల అధ్యక్షుడు, రాష్ట్ర ఫైనాన్స అర్బన ఇనఫ్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ సభ్యుడు డి.రామాంజనేయులు సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె.పార్వతమ్మ, పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఆర్.తిరుమలేశ్వరరెడ్డి, పీయూ మాదన్న, జే.గం గాధర్‌గౌడ్, ఈవీ.రమణ, టి.వినోద్‌కుమార్, వాకిటి మాదేష్ పాల్గొన్నారు.
కాటసాని నివాసంలో.. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి నివాసంలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం తన స్వగృహంలో యువ నాయకుడు కాటసాని శివనరసింహారెడ్డితో కలిసి ఆయన కేక్‌కట్ చేశారు. పాణ్యం నియోజక వర్గంలోని కల్లూరు, గడివేముల, పాణ్యం ఓర్వకల్లు మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూలబోకేలు, పూల దండలు, శాలువాలతో మాజీ ఎమ్మెల్యే కాటసానిని సన్మానించి శుభా కాంక్షలు తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: మండలంలో అన్ని గ్రామాల్లో నూతన సంవత్సర వేడుక లను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం అర్దరాత్రి 12 గంటల దాటాక యువకులు కేరింతలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి దంపతులకు, నంద్యాల ఎంపీ బైౖరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైౖరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, పొదుపు లక్ష్మి మండల ఐక్య సంఘం గౌరవ సలహాదా రురాలు విజయభారతి, టీడీపీ ఉపాధ్యక్షుడు మోహన రెడ్డి, మండల కన్వీనర్ గోవిందరెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎస్‌ఐ సునీల్ కుమార్, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన మల్లికార్జున రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, చంద్ర పెద్దస్వామి, జడ్పీటీసీ రంగనాథగౌడు, ఎంపీపీ తిప్పన్న, సర్పంచు చంద్రగోవర్దనమ్మ ఆయా శాఖ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఓర్వకల్లులోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో కేక్‌ను నిర్వాహకుడు రాధాకృష్ణ అన్నయ్య కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, చంద్రపెద్దస్వామి, ఆకుల మహేష్, కాకి దేవేంద్ర, రామ మద్దిలేటి, ఖాదర్‌బాషా, నాగతిరుపాలు, కృష్ణారెడ్డి, మధుమోహన, జీకే వెంగన్న, అల్లాబాబు, అబ్దుల్లా, శ్రీరాములు, వేణు, రాము, బజారు పాల్గొన్నారు.
పొదుపులక్ష్మి సంఘం ఆధ్వర్యంలో..: మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం పొదుపులక్ష్మి మహిళలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పొదు పులక్ష్మి మండల ఐక్య సంఘం గౌరవ సలహాదారురాలు విజయభారతి కేక్ కట్ చేసి మిఠా యిలను పంపిణీ చేశారు. పొదుపు మహిళలు విజయభారతికి నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు.
కోడుమూరు రూరల్: మండలంలోని గ్రామాల్లో ఆంగ్ల సంవత్సరాదిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అర్థరాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రజలు సంతోషాల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తమ మిత్రులు, బంధువులకు ఫోన, వాట్సాప్ సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వర్కూరు ఏబీఎం చర్చిలో ఎస్‌ఐ శ్రీనివాసులు న్యూఇ యర్ వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ రాజ్‌కుమార్, సంఘపెద్దలు ఎస్‌ఐను దుశాలువ, పూలమాల వేసి సత్కరించారు.
కర్నూలు అగ్రికల్చర్: జిల్లా కేంద్రమైన కర్నూలులో వివిద ప్రభుత్వ విభాగాల్లో అధికారులు, సిబ్బంది న్యూఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కర్నూలు మార్కెట్ కమిటీ యార్డులో సెలక్షన గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెట్ సెక్రటరీ వెంకటేశ, సూపర్‌వైజర్లు కేశవ రెడ్డి, శివన్న, నాగేష్‌లు ఒకరికొకరు పూలబొకేలు అందించుకుని శుభా కాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ కర్నూలు ఏడీఏ శాలురెడ్డి, కల్లూరు ఏవో శ్రీనివాసరెడ్డి, టెక్నికల్ ఏవో దస్తగిరి రెడ్డి, కర్నూలు ఏవో రోనాల్ రుక్ వారి సిబ్బంది న్యూఇయర్ వేడుకలను కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
గూడూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సీనియర్ టీడీపీ నాయకుడు, నగర పంచాయతీ మాజీ వైస్ చైర్మన కురుకుంద రామాంజనేయులు అన్నారు. బుదవారం గూడూరు పట్టణంలో టీడీపీ శ్రేణులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ శ్రేణులు మాజీ వైస్ చైర్మన రామాంజనేయులును శాలువాలు కప్పి, పూలమాలలతో సన్మానించారు. అనంతరం టీడీపీ శ్రేణులు కర్నూలు తరలివెళ్లి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని పూలమా లలు, శాలువా కప్పి సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రేమట వెంటటేశ్వర్లు, సృజన, పౌలు, దానమయ్య, కోడుమూరు షాషావలి, చెంచుల విజయ్ కుమార్, పెద్ద చాంద్‌బాషా పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతే చంద్రబాబు ధ్యేయం: పేదల అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్ నాయుడు అన్నారు. బుధవారం గూడూరు పట్టణంలో నూతన సంవ త్సర వేడుకలను పురష్కరించుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు గజేంద్ర గోపాల్ నాయుడును శాలువా కప్పి, పూలమాలలతో సన్మా నించారు. కేక్ కట్ చేసి మిఠాయి పంపిణి చేశారు. ఈ సందర్భంగా గజేంద్ర గోపాల్ నాయుడు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. గూడూరు టీడీపీ నాయకులు నాగప్ప యాదవ్, కురువ హను మంతు, రవి తదితరులు కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని కలిసి పూలమాలలు శాలువాలు కప్పి సన్మానించారు.