విద్యార్థులతో కలిసి భోజనం చేయడం నా అదృష్టం
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:33 AM
విద్యార్థులతో కలిసి భోజనం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ
కోవెలకుంట్ల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులతో కలిసి భోజనం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. శనివారం కోవెలకుంట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బీసీ హాజరై ప్రారంభించారు. ముందుగా కోవెలకుంట్ల జూనియర్ కళాశాలకు చేరుకున్న మంత్రి బీసీకి విద్యార్థులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ రమాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి బీసీ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇస్తున్నామని చెప్పి జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం రద్దుచేసిందన్నారు. దీంతో పేద విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మంత్రి నారాలోకేశ్ పేద విద్యార్థుల కష్టాలు తెలుసుకుని 475 జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారన్నారు. కోవెలకుంట్ల జూనియర్ కళాశాలలో ఈ పథకం నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి విద్యార్ధి క్రమశిక్షణ, పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలన్నీ తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచిగా రాణించి బనగానపల్లె నియెజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలని కోరారు. అనంతరం చెన్నంపల్లి భాస్కర్‌రెడ్డి అందించిన నోటుబుక్కులు, పెన్నులను విద్యార్థులకు పంపిణీ చేశారు. తరువాత మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి బీసీ విద్యా ర్థులకు స్వయంగా వడ్డించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వర ప్రసాదరావు, ఈవోపీఆర్డీ ప్రకాశ్ నాయుడు, ఎంఈవోలు వెంకట్రామిరెడ్డి, వెంకటసుబ్బయ్య, అధ్యాప కులు, కె.మల్లికార్జునరెడ్డి, గడ్డం నాగేశ్వర్‌రెడ్డి, గువ్వల సుబ్బారెడ్డి, ముస్లిం మైనార్టీ జిల్లా నాయకులు ఎస్‌ఏ గఫూర్, కలుగొట్ల అర్జున్‌రెడ్డి, వల్లంపాటి సర్పంచ్ జగదీశ్వర్‌రెడ్డి, పెనుగొండ రాజశేఖర్, కుళాయిబాషా, గడ్డం అమర్‌నాధరెడ్డి, లాయర్ శ్రీకాంత్, బోదన బాలనాగన్న, బిజినవేముల సుబ్బరాయుడు పాల్గొన్నారు.