పేద విద్యార్థుల ఫీజు చెల్లిస్తా
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:00 AM
మండ లంలోని పేద విద్యార్ధుల ఫీజులు తానే చెల్లిస్తానని ఎంపీ బస్తీపాటీ నాగరాజు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబుకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని అన్నారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.
ఎంపీ బస్తిపాటి నాగరాజు
నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం
దేవనకొండ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని పేద విద్యార్ధుల ఫీజులు తానే చెల్లిస్తానని ఎంపీ బస్తీపాటీ నాగరాజు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబుకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని అన్నారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు అభివృద్ధి పథంలో దూసు కుపోతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 94పథకాలు అగిపోయాయన్నారు. నిర్వహణ లేక జల జీవన్ మిషన్ నిధులు 80 శాతం వెనక్కి వెళ్లాయని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికి కొళాయి ఏర్పాటు చేసి నీరందిస్తామ న్నారు. టీడీపీ కన్వీనర్ విజజభాస్కర్ గౌడ్, మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు, బడిగింజల రంగన్న, తహసీల్దార్ లోకేశ్వరయ్య, జనసేన ఇన్‌చార్జి వెంకప్ప, ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌శర్మ, నాయకులు రామారావునాయుడు, ఉచ్చీరప్ప, అధ్యాపకులు వీరగురుడు, కృష్ణమూర్తి, సీఐ వంశీనాథ్, తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ఎంపికి ఏఐఎస్‌ఎఫ్ నాయకులు భాస్కర్, మధు, సురేంద్ర, రవితేజ, భరత్ వినతిపత్రం ఇచ్చారు.
విధ్యార్థులకు ఇంటర్మీడియట్ కీలకం
పత్తికొండ: విద్యార్థులకు ఇంటర్మీడియట్ కీలకమని, దురలవాట్లకు లోనై జీవితాలను నాశనం చేసుకో వద్దని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు. శని వారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. డ్రగ్స్ బారినపడితే భవిష్యత్ అంధకారమవుతుందని, తల్లిదండ్రులకు కన్నీరు మిగులుతుందన్నారు. పెద్దహుల్తి-హోసూరు గ్రామాల మధ్య రూ. 2 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్రాజెక్టుద్వారా 1,300 మంది ఉద్యోగాలు కల్పించనున్నామని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న గోల్డ్‌మైన్స్‌లోకూ ఉద్యోగాలు కల్పిస్తామని ఐదేళ్లలో పత్తికొండను అభివృద్ధి చేస్తా మన్నారు. పాలిటెక్నిక్ కళాశాలను త్వరలో పత్తికొండలో ఏర్పాటుచేస్తామని, ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అనంతరం విద్యార్థుల సౌకర్యార్థం ప్లేట్లు, గ్లాసులు కొనేందుకు ఎమ్మెల్యే శ్యాంబాబు రూ.40వేలను ప్రిన్సిపాల్ నైమున్నీసాకు అందించారు. ఆర్డీవో భరత్‌నాయక్, సీఐ జయన్న, ఎంఈవో రమేష్, బాలురహైస్కూల్ హెచ్‌ఎం, టీడీపీ నాయకులు తిమ్మయ్యచౌదరి, పూర్వవిధ్యార్ధులు ఆలంకొండనబి, బత్తినలోక్‌నాధ్, కళాశాల అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉన్నతస్థాయికి చేరుకోవాలి: ఎమ్మెల్యే
ఆలూరు: కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకో వాలని ఎమ్మెల్యే విరుపాక్షి సూచించారు. శనివారం ఆలూరు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్ రమాదేవి, కో ఆప్షన్ సభ్యులు భాష, వైసీపీ నాయకులు అరికెర వెంకటేశ్వరులు, భాస్కర్, శివ, వీరేశ్, వరుణ్, కొట్టాల రాజు, తిక్కస్వామి పాల్గొన్నారు.
ఆదోని అగ్రికల్చర్: విద్య ప్రాముఖ్యతను గుర్తిస్తే రాణిస్తారని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పేర్కొ న్నారు. శనివారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళా శాలలో భోజన పథకాన్ని ప్రారంభిం చారు. ఎమ్మెల్సీ మధుసూదన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బోయ శాంత జనసేన ఇన్‌చార్జ్ మల్లప్ప పాల్గొ న్నారు. ప్రిన్సిపాల్ సంజన్న, టీడపీ నాయకులు రామ స్వామి, గుడిసె శ్రీరాములు లక్ష్మీనారాయణ, తిమ్మప్ప అధ్యాపకులు గోవిందరాజులు, సూరిబాబు, వేదవతి పాల్గొన్నారు.
ఆలూరు: టీడీపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా ర్థుల ఆకలి తీర్చిందని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్ అన్నారు. శనివారం జూనియర్ కళాశాలలో మధ్యా హ్న భోజనాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపాల్ రమా దేవి, ఆలూరు బ్రాంచ్ కెనాల్ డీస్ట్రి బ్యూటరీ కమిటీ అధ్యక్షుడు నగరడోణ కిష్టప్ప, ఎం ఈవోలు కోమల దేవి, చిరంజీవి రెడ్డి, టీడీపీ నాయ కు లు రాంనాథ్ యాదవ్, సాలి సాహెబ్, నరసప్ప, హరిరెడ్డి, కొమ్ము రాజు, సురేంద్ర, రాము యాదవ్, రామకృష్ణ, వన్నూర్ వల్లి, మెకానిక్ వీరేష్, రామూర్తి పాల్గొన్నారు.
ఆస్పరి: విద్యార్థులు ఇష్టపడి చదవాలని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్ సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పారంభిం చారు. కన్వీనర్ పరామరెడ్డి, గ్రామ సర్పంచ్ మూలింటి రాధమ్మ, ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహ, ఎస్ తిమ్మన్న, ఉచ్చరప్ప, సాలే సాహెబ్, రంగనాథ్, సతీష్ కుమార్, యుగంధర్, మహేష్ పాల్గొన్నారు.