ఇంటిగ్రేటెడ్ క్లీన్‌ఎనర్జీ పాలసీకి చోటు
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:40 AM
ఐదేళ్ల విద్యుత్ ప్రణాళికలో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ(ఐసీఈ) పాలసీకి చోటు లభిం చింది. 2024 అక్టోబరు 21న జరిగిన ఏపీ ఈఆర్‌సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఐసీఈపై విస్తృత స్థాయి చర్చ, అవసరమైన మార్పులు, చేర్పులతో రాష్ట్ర సమన్వయ కమిటీ అమోదం తెలిపింది.
ట్రాన్స్‌కోకు అదనంగా 10,800 మెగావాట్ల విద్యుత్ సమకూరే అవకాశం
సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
ఐదేళ్ల విద్యుత్ ప్లాన్‌కు ఆమోదం తెలిపిన ఫోరం
కల్లూరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల విద్యుత్ ప్రణాళికలో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ(ఐసీఈ) పాలసీకి చోటు లభిం చింది. 2024 అక్టోబరు 21న జరిగిన ఏపీ ఈఆర్‌సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఐసీఈపై విస్తృత స్థాయి చర్చ, అవసరమైన మార్పులు, చేర్పులతో రాష్ట్ర సమన్వయ కమిటీ అమోదం తెలిపింది. ఈ పాలసీ దేశంలో రాష్ర్టాన్ని పునరుత్పాదక పంప్డ్ హైడ్రో సోరేజీ హబ్‌గా మారు స్తుందన్న ఆశాభావాన్ని కమిషన్ వ్యక్తం చేసింది. శనివారం జిల్లా కేంద్రంలోని ఏపీఈఆర్‌సీ భవన్‌లో ఇన్‌చార్జ్ చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ అఽఽధ్యక్షతన ఏపీ ట్రాన్స్‌కో 5వ విద్యుత్ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్‌కో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విజయానంద్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ రవి పట్టంశెట్టి, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి హాజరై 2024-2025 నుంచి 2028-29 ఆర్థిక ఏడాదికి సంబంధించి రాష్ట్ర విద్యుత్ ప్రణాళికపై చర్చించి ఆమోదం తెలిపారు. స్టేట్ ట్రాన్స్ మిషన్ యుటిలిటీ(ఎస్‌టీయూ) ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈఆర్‌సీ లోడ్ ఫోర్‌కాస్ట్ , రిసోర్స్ ప్లాన్ మార్గదర్శకాల మేరకు ప్రతి ఐదేళ్లకు నియంత్రణ వ్యవధి కోసం లైసెన్స్ దారుల లోడ్ సూచన, వనరుల ప్రణాళి కలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఏర్పాటైన సమావేశంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, సరఫరాను ప్రోత్సహించడానికి ఏపీజెన్‌కో, ఏపీ డిస్కమ్‌లతో చర్చించారు. తద్వారా సమావేశంలో అమోదం పొందిన ఐఈసీ పాలసీ ద్వారా ఏపీట్రాన్స్‌కోకు అదనంగా 10,800 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుందని భావిస్తున్నారు. ఫోరం ఏపీట్రాన్స్‌కో రూపొందించిన స్టేట్ ఎలక్ర్టిసిటీ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించి దానిని ప్రచురించడానికి ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా ఏపీఈఆర్‌సీ ఇన్‌చార్జ్ చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ మాట్లాడుతూ రాబోయే వేసవిలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయాల్సిన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రబీ పంటలకు కరెంట్ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విద్యుత్ ప్రమాదాలు పెరిగిపో తుండటంతో భద్రతా చర్యలను పెంచి పంపిణీ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రమాద కేసులు తగ్గుముఖం పట్టేలా చూడాలని మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఈఆర్‌సీ సభ్యుడు పీవీఆర్.రెడ్డి, ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీలు పృథ్వితేజ్, సంతోషరావు, జెన్‌కో ఛీఫ్ ఇంజనీర్ అశోక్‌కుమార్, ఎన్‌టీపీసీ జనరల్ మేనేజర్ రోహిత్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.