నంద్యాల ఏఎస్పీగా మంద జావలి అల్ఫోన్స్
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:12 AM
నంద్యాల ఏఏస్పీగా మంద జావలి అల్ఫోన్స్ నియామకమయ్యారు.
త్వరలోనే బాధ్యతల స్వీకరణ
నంద్యాల, జనవరి 13, (ఆంధ్రజ్యోతి) : నంద్యాల ఏఏస్పీగా మంద జావలి అల్ఫోన్స్ నియామకమయ్యారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసిన పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఏఏస్పీగా మంద జావలి అల్ఫోన్స్‌ను నియమించారు. ఈమె 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయితే నంద్యాల ఏఏస్పీగా ఆమెను నియమించినప్పటికీ ఆమె మాత్రం నంద్యాల సబ్ డివిజన్ పోలీసు అధికారిగా సేవలందించాల్సి ఉంది. ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం డీఎస్పీగా పని చేస్తున్న శ్రీనివాసరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.