నమో నారసింహా...
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:13 AM
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సోమవారం విశేష పూజలు నిర్వహించారు.
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. భోగి పండుగను పురష్కరించుకుని చిత్తం చిరు గాలే పాశురం వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాదవరదస్వామి ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదాదేవి అమ్మ వారికి నవకలశ తిరుమంజనం నిర్వహించారు. అనం తరం ప్రహ్లాదవరదస్వామికి, గోదాదేవి అమ్మ వారికి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్య నారాయణన్ ఆధ్వర్యంలో ఈ పూ జా కార్యక్రమాలు జరిగాయి.
శ్రీవారి దర్శన వేళల్లో మార్పు: అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి దర్శన సమయాల్లో మార్పులు చేసినట్లు మఠం నిర్వా హకులు, ఆలయ మేనేజర్ మురళీధరన్ సోమవారం తెలిపారు. ఆలయ 46వ పీఠాధిపతి ఆదేశాల మేరకు నారసింహుడు పా ర్వేట ఉత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీన ఎగువ అహోబిలంలో సాయంత్రం 4 గంటల వరకు, దిగువ అహో బిలంలో సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు.