నాయకుల ఇళ్ల వద్ద సందడి..
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:24 PM
నూతన సంవత్సరం సందర్భంగా రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద బుధవారం సందడి వాతావరణం కనిపించింది. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్యాం బాబును కలిసేందుకు నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు
ఎమ్మెల్యేను కలిసిన పోలీసు అధికారులు, న్యాయవాదులు, నాయకులు
పత్తికొండ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద బుధవారం సందడి వాతావరణం కనిపించింది. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్యాం బాబును కలిసేందుకు నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో గుత్తిసర్కిల్, ఎంపీడీవో కార్యాలయ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. డీఎస్పీ వెంకట్రాయ్య, సీఐలు, ఎస్‌ఐలు ఎమ్మెల్యేకు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాదులు, పీఈటీల సంఘ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డికి పార్టీశ్రేణులు శుబాకాంక్షలు తెలిపారు.
పత్తికొండ టౌన్: మాజీమంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని అబిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపిపీ నాగరత్నమ్మ, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్‌చైర్మన్ రామచంద్రారెడ్డి ఉన్నారు. జనసేన ఇన్‌చార్టి రాజశేఖర్‌కు కార్యకర్తలు శుబాకాంక్షలు తెలిపారు. సీపీఐ కార్యాలయంలో నాయకుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సీనియర్ నాయకులు భీమలింగప్ప, మండల కార్యదర్శి రాజాసాహేబ్‌కు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్‌కు, జనసేన బాధ్యుడు రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కే.శ్రీదేవి కర్నూలులో ఉండటంతో కార్యకర్తలు అక్కడికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారన్నారు.